BCCI : 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ ఆదాయం ఎంతో తెలుసా? ఐపీఎల్ ద్వారానే 5 వేల కోట్ల పై చిలుకు ..
ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత ధనిక బోర్డుగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి పేరుంది.

BCCI Generated Rs 9,741Crore Revenue In fy 2023-24
ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత ధనిక బోర్డుగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి పేరుంది. బీసీసీఐ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 9,741.7 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో ఐపీఎల్ ద్వారానే 59 శాతం లభించింది.
2008లో ఐపీఎల్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ టీ20 లీగ్ బీసీసీఐకి బంగారు బాతుగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ టీ20 టోర్నీల్లో ఒకటిగా నిలిచింది. దీంతో ప్రతీ ఏటా.. ఈ లీగ్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూ పోతుంది.
🚨 THE BCCI HAS GENERATED 9,741.7CR IN 2023-24. 🚨
– The IPL contributed 5,761cr alone. ( The Hindu). pic.twitter.com/dSfPAdIZze
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 18, 2025
రెడిఫ్యూజన్, ది హిందూ నివేదిక ప్రకారం.. బీసీసీఐ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.9,741.7 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో ఐపీఎల్ ద్వారానే రూ.5,761 కోట్లు లభించాయి. ఇక ఐపీఎల్ కాకుండా టీమ్ఇండియా ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌ల మీడియా హక్కుల ద్వారా బీసీసీఐకి రూ.361 కోట్ల ఆదాయం సొంతమైనట్లు తెలిపింది.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభ సీజన్ ద్వారా కూడా బీసీసీఐ అదనపు ఆదాయాన్ని ఆర్జించినట్లు నివేదిక పేర్కొంది. ఇది మూడు సీజన్లను విజయవంతంగా నిర్వహించేందుకు కారణమైనట్లు తెలిపింది.
ఇక బీసీసీఐ వద్ద రూ.30వేల కోట్ల నిల్వలు ఉన్నాయని, దీని ద్వారా సంవత్సరానికి రూ.1000కోట్ల వడ్డీని సంపాదిస్తుందని పేర్కొంది. స్పాన్సర్‌షిప్‌లు, మీడియా హక్కులు, మ్యాచ్ రోజుల నుండి వచ్చే ఆదాయాలు పెరగడం వల్ల బోర్డు ఆదాయం స్థిరంగా ఉండటమే కాకుండా ప్రతి సంవత్సరం 10-12% పెరుగుతుందని అంచనా వేసింది.