SRH : ఐపీఎల్ 2026 ముందు సన్‌రైజర్స్ కీలక నిర్ణయం! ఇషాన్ కిషన్ పై వేటు? కేకేఆర్ ఆల్‌రౌండర్ పట్ల ఆసక్తి!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కావడానికి చాలా సమయం ఉంది.

IPL trade rumours SRH interested in Venkatesh Iyer
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కావడానికి చాలా సమయం ఉంది. అయినప్పటికి కూడా ఇప్పటి నుంచే అన్ని ఫ్రాంచైజీలు ఈ సీజన్ కోసం సిద్ధం అవుతున్నాయి. ఐపీఎల్ 2025 సీజన్‌లో పెద్దగా రాణించని ఆటగాళ్లను వదులుకోవడంతో పాటు కొత్త సీజన్‌లో రాణించే ఆటగాళ్ల కోసం అన్వేషిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
కాగా.. ట్రేడ్ విండో ద్వారా ఫ్రాంచైజీలు ఆటగాళ్లను మార్చుకోవచ్చు. ఈ విధానం ద్వారా ఆటగాళ్లను భర్తీ చేసుకోవాలని సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ను కొనుగోలు చేసేందుకు సిద్దం అని సీఎస్‌కే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇందుకు సంబంధించిన డీల్ జరిగిందా? లేదా అన్నది తెలియదు.
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ సైతం ఓ ప్లేయర్ పై ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇషాన్ కిషన్ రూ.11.25 కోట్లకు కొనుగోలు చేసింది ఎస్ఆర్‌హెచ్. ఈ సీజన్‌లో ఇషాన్ 14 మ్యాచ్‌లు ఆడి 354 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. దీంతో ఇతడిని వదులుకోవాలని ఎస్ఆర్‌హెచ్ నిర్ణయించుకుందట.
అతడి స్థానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు వెంకటేష్ అయ్యర్‌ను సొంతం చేసుకోవాలని సన్‌రైజర్స్ భావిస్తోందట. ఐపీఎల్ 2025 మెగావేలంలో కేకేఆర్ జట్టు అయ్యర్‌ను 23.75 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. అయితే.. ఐపీఎల్ 2025 సీజన్‌లో అయ్యర్ నిరాశ పరిచాడు. 20 సగటుతో 142 పరుగులు మాత్రమే చేశాడు.
Karun Nair : ఇందుకేనా మరో ఛాన్స్ అడిగింది.. ఇక కష్టమే.. తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే..
అయినప్పటికి ఆల్‌రౌండర్ కావడంతో అయ్యర్ కోసం ఎస్ఆర్‌హెచ్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సైతం అయ్యర్ కోసం చూస్తున్నట్లుగా ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి.