Viral video: రనౌట్‌ కోసం ఇన్నితిప్పలా..! క్రికెట్‌లో ఇంతకు ముందెన్నడూ చూడని ఫన్నీ సన్నివేశం.. ఈ వీడియో చూస్తే నవ్వులేనవ్వులు..

మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ -2025లో భాగంగా రాయ్‌గడ్ రాయల్స్ వర్సెస్ కొల్లాపూర్ టస్కర్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఫన్నీ సన్నివేశం చోటు చేసుకుంది.

Maharashtra Premier League Viral video

Maharashtra Premier League Viral video: మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ -2025లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాయ్‌గడ్ రాయల్స్ వర్సెస్ కొల్లాపూర్ టస్కర్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు పిచ్‌పై పరుగు తీసే క్రమంలో ఢీకొన్నారు. ఇదే సమయంలో వారిని రనౌట్ చేసేందుకు ఫీల్డర్లు పడిని తిప్పలు అంతాఇంతా కాదు. ఇందుకు సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకున్నామంటూ ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Shubman Gill: శుభ్‌మాన్ గిల్‌‌కు ఐసీసీ బిగ్‌షాక్.. ‘బ్లాక్ సాక్స్’ జరిమానా తప్పదా..? 19.45 నియమం ఏం చెబుతుంది..

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కొల్లాపూర్ టస్కర్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. అనంతరం 165 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు రాయగఢ్ రాయల్స్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. ఆ జట్టు బ్యాటర్లు రెండో పరుగు కోసం పిచ్ పై పరుగెడుతుండగా ఒకరినొకరు ఢీకొని కిందపడిపోయారు. ఇదే సమయంలో ఫీల్డర్ బాల్‌ను అందుకొని కీపర్‌కు విసిరాడు. కీపర్ చేతిలోకి బాల్ వచ్చింది.. బ్యాటర్లు ఢీకొనడంతో పిచ్ మధ్యలోనే ఉన్నారు.. కీపర్ చేతిలోని బాల్‌ను వికెట్లకు కొడితే బ్యాటర్ రన్‌ఔట్ అయ్యేవాడు. కానీ, టెన్షన్‌లో కీపర్ బంతిని బౌలర్ వైపు విసిరాడు.

Also Read: IND vs ENG: ఇదెక్కడి షాట్ రా అయ్యా..! రిషబ్ పంత్ కొట్టిన షాట్‌కు బెన్ స్టోక్స్‌కు దిమ్మతిరిగిపోయింది.. నవ్వుకుంటూ పంత్ దగ్గరకొచ్చి.. వీడియో వైరల్..

బౌలర్ ఆ బంతిని అందుకొని రనౌట్ చేసేలోగా బ్యాటర్ లేచి వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి డ్రైవ్ చేసి క్రీజులోకి బ్యాట్ పెట్టాడు. దీంతో పక్కనేఉన్న మరో ప్లేయర్ బంతిని అందుకొని పరుగెత్తుకుంటూ వెళ్లి స్ట్రైకర్ ఎండ్‌లోని వికెట్లకు విసిరాడు.. ఆ బంతి వికెట్లను తాకుండా బౌండరీ లైన్ వైపు దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు బ్యాటర్లు రనౌట్ నుంచి బయటపడగా.. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన రీతిలో ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.


ఇదిలాఉంటే ఈ మ్యాచ్ లో 165 పరుగుల లక్ష్యాన్ని రాయగఢ్ జట్టు 19.4 ఓవర్లలో చేధించి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.