Mahira Sharma's Mother rejects Rumours Of Her Daughter Dating Mohammed Siraj
ఇటీవల టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ డేటింగ్‌కు సంబంధించిన వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఫలానా అమ్మాయితో అతడు డేటింగ్‌లో ఉన్నాడంటూ రూమర్లు వస్తున్నాయి. అయితే.. అందులో ఏ మాత్రం నిజం ఉండడం లేదు. మొన్న లెజెండరీ సింగర్ ఆశాభోస్లే మనవరాలు జనాయ్ భోస్లేతో డేటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. వీటిని సిరాజ్‌తో పాటు జనాయ్ భోస్లే సైతం ఖండించారు. తమ మధ్య ఉన్నది అన్న చెల్లెల అనుబంధం అని పేర్కొన్నారు.
ఇక తాజాగా బిగ్‌బాస్ 13 పైనలిస్ట్ మహిరా శర్మతో అతడు డేటింగ్ చేస్తున్నాడని ఆంగ్ల మీడియాలో కథనాలు వచ్చాయి. వీరిద్దరి దగ్గరి సన్నిహితులు ఈ విషయాన్ని వెల్లడించినట్లుగా సదరు కథానాలు పేర్కొన్నాయి. వీటిపై మహిరా శర్మ తల్లి సానియా శర్మ స్పందించింది. అందులో ఎంత మాత్రం నిజం లేదంది. అవన్నీ కేవలం రూమర్లేనని స్పష్టం చేసింది. వాటిని ఎవరూ నమ్మవద్దని తెలిపింది. దీంతో మరోసారి సిరాజ్ డేటింగ్ వార్తలు అవాస్తం అని తేలిపోయాయి.
SL vs AUS : ఉస్మాన్ ఖవాజా అరుదైన ఘనత.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే ఒక ఆసీస్ ఆటగాడు
గతంలో పరాస్ ఛాబ్రాతో మహిరా శర్మ డేటింగ్!
గతంలో మహిరా శర్మ, పరాస్ ఛాబ్రాలు ప్రేమించుకున్నారు. బిగ్‌బాస్ 13వ సీజన్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దాదాపు రెండేళ్ల పాటు వీరు డేటింగ్‌లో ఉన్నారు. అయితే.. ఆ తరువాత ఇద్దరూ విడిపోయారు. ఈ విషయాన్ని పరాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తామిద్దరం ఒక్కప్పుడు రిలేషన్‌షిప్‌లో ఉన్నామని, అప్పుడు అంతా బాగుండేదన్నారు. అయితే.. విధి మరోలా ఉంది. జీవితంలో మంచి చెడులు ఉంటాయి. వాటిని మేము అనుభవించాం. కొన్నాళ్లకు ఇద్దరం కలిసి ఉండలేమని అర్థం చేసుకున్నాము. అందుకనే విడిపోయినట్లుగా చెప్పాడు.
Cricket Viral Video : ప్రపంచంలోనే అన్‌లక్కీ బ్యాటర్.. ఇలా రనౌట్ అవుతాడని ఊహించి ఉండడు సుమీ..!
ఛాంపియన్స్ ట్రోఫీలో దక్కని చోటు..
వ్యక్తిగత జీవితం ఎలాగున్నా కెరీర్‌లో ప్రస్తుతం సిరాజ్ కాస్త గడ్డుకాలాన్నీ ఎదుర్కొంటున్నాడు. ఫిబ్రవరి 16 నుంచి పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో సిరాజ్‌కు చోటు దక్కలేదు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్, వన్డే జట్టులోనూ చోటు దక్కలేదు.