SL vs AUS : ఉస్మాన్ ఖవాజా అరుదైన ఘనత.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే ఒక ఆసీస్ ఆటగాడు
ఇప్పటి వరకు ఆసీస్ క్రికెటర్లు ఎవ్వరూ శ్రీలంక గడ్డపై సాధించలేని ఓ రికార్డును ఉస్మాన్ ఖవాజా సాధించాడు.

Usman Khawaja becomes first australian player to score double hundred in test in Srilanka
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంక గడ్డ పై టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆస్ట్రేలియా ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గాలె వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో అతడు ఈ ఘనత అందుకున్నాడు. 290 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో ద్విశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. కాగా.. టెస్టుల్లో అతడికి ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం గమనార్హం.
147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంత వరకు ఏ ఆసీస్ బ్యాటర్ కూడా శ్రీలంక గడ్డ పై ద్విశతకం చేయలేదు. ఇప్పటి వరకు శ్రీలంక గడ్డపై అత్యధిక పరుగులు చేసిన ఆసీస్ బ్యాటర్ రికార్డు జస్టిన్ లాంగర్ పేరిట ఉండేది. 2004లో కొలంలో వేదికగా జరిగిన మ్యాచ్‌లో లాంగర్ 295 బంతుల్లో 166 పరుగులు సాధించాడు. తాజాగా లాంగర్ రికార్డును ఖవాజా బ్రేక్ చేశాడు. వీరిద్దరి తరువాత స్థానాల్లో డామిన్ మార్టిన్, లెహ్‌మన్, స్టీవ్ స్మిత్ లు ఉన్నారు.
Virat Kohli : 12 ఏళ్ల తరువాత రంజీ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ.. ఫ్యాన్ చేసిన పనికి అంతా షాక్..
DOUBLE HUNDRED FOR USMAN KHAWAJA…!!!!
– What a knock by Khawaja, Double Hundred in Sri Lanka at Galle, A memorable innings to remember forever in Australian Test history at Asia 🙇 pic.twitter.com/Sh1mmLnl1s
— Johns. (@CricCrazyJohns) January 30, 2025
ఈ మ్యాచ్‌లో మొత్తంగా 352 బంతులు ఎదుర్కొన్న ఖవాజా 16 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 232 పరుగులు చేశాడు.
శ్రీలంక గడ్డ పై అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా ప్లేయర్లు వీరే..
ఉస్మాన్ ఖవాజా – 232 పరుగులు
జస్టిన్ లాంగర్ – 166 పరుగులు
డామిన్ మార్టిన్ – 161 పరుగులు
డారెన్ లెహ్‌మన్ – 153 పరుగులు
స్టీవ్ స్మిత్ – 145 పరుగులు
Cricket Viral Video : ప్రపంచంలోనే అన్‌లక్కీ బ్యాటర్.. ఇలా రనౌట్ అవుతాడని ఊహించి ఉండడు సుమీ..!
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. తొలి ఇన్నింగ్స్‌లో 140 ఓవర్లు పూర్తి అయ్యే సరికి 5 వికెట్ల నష్టానికి 589 పరుగులు చేసింది. బ్యూ వెబ్‌స్టర్ (9), అలెక్స్ కేరీ (18)లు క్రీజులో ఉన్నారు. ఖవాజాతో పాటు స్టీవ్ స్మిత్ (141), జోస్ ఇంగ్లిష్ (102) సెంచరీలతో చెలరేగారు. ట్రావిస్ హెడ్ (57) హాఫ్ సెంచరీతో రాణించాడు. శ్రీలంక బౌలర్లలో ప్రభాస్ జయసూర్య మూడు వికెట్లు తీశాడు. జెఫ్రీ వాండర్సే రెండు వికెట్లు పడగొట్టాడు.