Cricket Viral Video : ప్రపంచంలోనే అన్‌లక్కీ బ్యాటర్.. ఇలా రనౌట్ అవుతాడని ఊహించి ఉండడు సుమీ..!
ఓ బ్యాటర్ రనౌట్ అయిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో అంత వింత ఏముందని అంటున్నారా? బ్యాటర్ తప్పేమీ లేదు, రన్ కోసం ప్రయత్నించలేదు. అదే సమయంలో ఫీల్డర్ అద్భుమైన త్రో వేశాడా? అంటే అదీ లేదు. మరి

Batter Gets Run Out In Bizarre Way Fans Call It world Unluckiest Dismissal
సాధారణంగా క్రికెట్‌లో బ్యాటర్లు.. క్యాచ్ లేదా ఎల్బీడబ్ల్యూ లేదా బౌల్డ్ లేదా రనౌట్‌గా పెవిలియన్‌కు చేరుకుంటుంటారు. చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే హిట్ వికెట్‌గా ఔట్ కావడాన్ని చూస్తుంటాం. కాగా.. ఓ బ్యాటర్ రనౌట్ అయిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో అంత వింత ఏముందని అంటున్నారా? అక్కడికే వస్తున్నాం ఆగండి ? పాపం ఇందులో బ్యాటర్ తప్పేమీ లేదు, రన్ కోసం ప్రయత్నించలేదు. అదే సమయంలో ఫీల్డర్ అద్భుమైన త్రో వేశాడా? అంటే అదీ లేదు. అయినప్పటికి బ్యాటర్ రనౌట్ అయ్యాడు. ఇంతకంటే అన్‌లక్కీ బ్యాటర్ ప్రపంచంలో మరొకరు లేడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అసలేం జరిగింది?
దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ అండర్-19 జట్ల మధ్య అనధికారిక టెస్టు మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ మూడో రోజు ఇంగ్లాండ్ బ్యాటర్ ఆర్యన్ సావంత్ దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆర్యన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్ జాన్ రోల్స్ బౌలింగ్‌లో ఓ బంతిని స్లాగ్ స్వీప్ ఆడాడు. అయితే.. బంతి షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జోరిచ్ వాన్ హెల్మెట్‌ను తాకింది.
You have seen catches being taken after the ball was struck into the helmet of a short leg fielder
BUT
Have EVER seen someone runout off the helmet of a short leg fielder? 😱🤯 pic.twitter.com/5PEgAKUr0c
— Werner (@Werries_) January 29, 2025
హెల్మెట్‌ను తాకిన బంతి వెంటనే స్టంప్స్ పైకి వచ్చింది. బెయిల్స్‌ను పడగొట్టింది. ఇదంతా సెకన్ల వ్యవధిలో జరిగిపోయింది. షాట్ ఆడే క్రమంలో సావంత్ క్రీజులోంచి కాలు బయట పెట్టాడు. దీన్ని చూసిన సఫారీ ఆటగాళ్లు రనౌట్ అంటూ అప్పీలు చేశారు. ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేయగా పలు మార్లు రిప్లై పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. దీంతో బ్యాటర్ సావంత్ షాక్ కు గురైయాడు. కాస్త తేరుకుని నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.
మరోవైపు ఫీల్డర్ జోరిచ్ మైదానంలో కుప్పకూలిపోయాడు. అతడిని వెంటనే మైదానం బయటకు తీసుకువెళ్లారు. అతడు బాగానే ఉన్నాడని దక్షిణాఫ్రికా జట్టు వెల్లడించింది. కాగా.. సావంత్ రనౌట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.