Steve Smith : 10 వేల పరుగుల క్లబ్‌లో స్టీవ్ స్మిత్.. ఇప్పటి వరకు టెస్టుల్లో ఎంత మంది పదివేల పరుగులు చేశారో తెలుసా?
టెస్టు క్రికెట్‌లో స్టీవ్ స్మిత్ 10 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు.

Steve Smith joins in 10000 test runs club 15th player overall
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. బుధవారం గాలే వేదికగా శ్రీలంకతో ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో ఒక్క పరుగు సాధించిన తరువాత అతడు ఈ రికార్డును అందుకున్నాడు. ప్రభాస్ జయసూర్య బౌలింగ్‌లో సింగిల్ తీసిన స్మిత్ సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా(ఇన్నింగ్స్‌ల పరంగా) ఈ ఘనత సాధించిన ఐదో బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 15వ బ్యాటర్‌గా నిలిచాడు.
వాస్తవానికి ఈ రికార్డును స్టీవ్ స్మిత్ భారత్‌తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనే అందుకోవాల్సి ఉంది. అయితే.. తృటిలో ఆ అవకాశాన్ని కోల్పోయాడు. ఇప్పుడు 24 రోజుల తరువాత లంకపైన స్మిత్ ఈ రికార్డును అందుకున్నాడు. ప్రస్తుతం స్మిత్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ మ్యాచ్‌కు ముందు స్మిత్ 114 టెస్టుల్లో 55.9 సగటుతో 9999 పరుగులు చేశాడు.
ICC CEO : పాకిస్తాన్ ఎఫెక్ట్.. ఐసీసీ సీఈవో రాజీనామా
An exclusive club welcomes another member 👏
Well played, Steve Smith 🏏
More ➡️ https://t.co/t44tcMDKZX pic.twitter.com/dJRoa6n0FL
— ICC (@ICC) January 29, 2025
టెస్టుల్లో అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఆటగాళ్లు వీరే..
బ్రియాన్ లారా (వెస్టిండీస్) – 195 ఇన్సింగ్స్‌ల్లో – 2004లో (ఇంగ్లాండ్ పై)
సచిన్ టెండూల్కర్ (భారత్) – 195 ఇన్నింగ్స్‌ల్లో – 2005లో (పాకిస్థాన్ పై)
కుమార్ సంగక్కర (శ్రీలంక) – 195 ఇన్నింగ్స్‌ల్లో – 2012లో (ఆస్ట్రేలియా పై)
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 196 ఇన్నింగ్స్‌ల్లో – 2008లో (వెస్టిండీస్ పై)
స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) – 205 ఇన్నింగ్స్‌ల్లో – 2025లో (శ్రీలంక పై)
రాహుల్ ద్రవిడ్ (భారత్) – 206 ఇన్నింగ్స్‌ల్లో – 2008లో (దక్షిణాఫ్రికాపై)
ఇప్పటి వరకు టెస్టుల్లో 10 వేల పరుగులు సాధించిన ఆటగాళ్లు వీళ్లే..
1. సచిన్ టెండూల్కర్ (భారత్) – 15921 పరుగులు
2. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 13378 పరుగులు
3. జాక్వస్ కలిస్ (దక్షిణాఫ్రికా) – 13289 పరుగులు
4. రాహుల్ ద్రవిడ్ (భారత్) – 13288 పరుగులు
5 .జో రూట్ (ఇంగ్లాండ్) – 12972 పరుగులు
6. అలిస్టర్ కుక్ (ఇంగ్లాండ్) – 12472 పరుగులు
7. కుమార సంగక్కర (శ్రీలంక) – 12400 పరుగులు
8. బ్రియాన్ లారా (వెస్టిండీస్) – 11953 పరుగులు
9. శివనారాయణ్ చంద్రపాల్ (వెస్టిండీస్) – 11867 పరుగులు
10. మహేలా జయవర్థనే (శ్రీలంక) – 11814 పరుగులు
11. అలెన్ బోర్డర్ (ఆస్ట్రేలియా) – 11174 పరుగులు
12. స్టీవా (ఆస్ట్రేలియా) – 10927 పరుగులు
13. సునీల్ గవాస్కర్ (భారత్) – 10122 పరుగులు
14. యూనిస్ ఖాన్ (పాకిస్థాన్) -10099 పరుగులు
15. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) – 10,058* పరుగులు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లు పూర్తి అయ్యే సరికి రెండు వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (59), ఉస్మాన్ ఖవాజా (102)లు క్రీజులో ఉన్నారు.