ICC CEO : పాకిస్తాన్ ఎఫెక్ట్.. ఐసీసీ సీఈవో రాజీనామా
ఐసీసీ సీఈఓ జెఫ్ అలార్జీస్ తన పదవికి రాజీనామా చేశారు

ICC Chief Executive Officer Geoff Allardice resigned
ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. మరికొన్ని రోజుల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కాబోతుండగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఐసీసీ సీఈఓ జెఫ్ అలార్జీస్ తన పదవికి రాజీనామా చేశారు. అతడు రాజీనామా చేయడానికి గల కారణాలు అయితే ఇంత వరకు వెల్లడి కాలేదు.
ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో పాకిస్థాన్ సన్నద్ధతను స్పష్టంగా వివరించలేకపోవడం ఆయన రాజీనామాకు ఓ కారణంగా ఓ ఐసీసీ సభ్యుడు పేర్కొన్నట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి. అమెరికా వేదికగా నిర్వహించిన టీ20 ప్రపంచకప్ 2024 ప్లాఫ్ కావడం, అక్కడ అనుకున్న బడ్జెట్ కంటే అధికం.. కావడం ఇలా చాలా కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు పాక్‌లో పర్యటించబోమని చెప్పడంతో హైబ్రిడ్ మోడ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. భారత్ ఆడే మ్యాచులు దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు. కరాచీ, లాహోర్, రావల్సిండి వేదికలుగా పాక్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే.. ఈ స్టేడియాలను ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆధునీకరించే పనులు ఎప్పుడో ప్రారంభం అయ్యాయి. కాగా.. టోర్నీ సమయం దగ్గర పడుతున్నా కూడా పనులు పూర్తి కాలేదని తెలుస్తోంది.
ఈ స్టేడియంలో పనులకు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అసంపూర్తిగానే స్టేడియాలు కనిపిస్తున్నాయి. దీంతో టోర్నీ నిర్వహణపై అనుమానాలు తలెత్తాయి. దీంతో పాకిస్థాన్ ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్య హక్కులు కట్టబెట్టడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే అలార్డీస్ రాజీనామా చేయడం గమనార్హం.
IND vs ENG : టీ20 అనుకున్నవా? టెస్టు అనుకున్నవా?.. హార్దిక్ పాండ్యాను ఏకిపారేస్తున్న నెటిజన్లు..
57 ఏళ్ల అలార్డీస్ ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి. 2012లో ఆయన జనరల్ మేనేజర్‌గా ఐసీసీలో చేరాడు. నవంబర్ 2021లో ఆయన ఐసీసీ సీఈఓగా నియమితులయ్యాడు. ఆయన రాజీనామా పై ఐసీసీ ఛైర్మన్ జైషా స్పందించాడు. అలార్డీస్ ఎంతో అంకితభావంతో పని చేశాడని తెలిపారు.
కాగా.. ఇటవలే హెడ్ ఆఫ్ ఈవెంట్స్ క్రిస్ టెట్లే, యాంటీ కరప్షన్ యూనిట్ హెడ్ అలెక్స్ మార్షల్, మార్కెటింగ్ అండ్ మీడియా హెడ్ క్లెయిర్ ఫర్లోంగ్‌లు వ్యక్తిగత కారణాలతో పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.