IND vs ENG : గంభీర్ ఏం చేస్తున్నావ్‌.. తోపు బ్యాట‌ర్‌ను ఆఖ‌రిలో పంపుతావా? భార‌త బ్యాటింగ్ ఆర్డ‌ర్ పై మాజీ క్రికెట‌ర్ ఫైర్‌..

టీమ్ఇండియా బ్యాటింగ్ ఆర్డ‌ర్ పై ఇంగ్లాండ్ మాజీ ఆట‌గాడు కెవిన్ పీట‌ర్స‌న్ తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేశాడు.

IND vs ENG : గంభీర్ ఏం చేస్తున్నావ్‌.. తోపు బ్యాట‌ర్‌ను ఆఖ‌రిలో పంపుతావా? భార‌త బ్యాటింగ్ ఆర్డ‌ర్ పై మాజీ క్రికెట‌ర్ ఫైర్‌..

Kevin Pietersen criticised Team India batting order in 3rd t20 against England

Updated On : January 29, 2025 / 1:46 PM IST

మూడో టీ20 మ్యాచ్‌లో భార‌త్ 26 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. 172 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 145 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. హార్దిక్ పాండ్య (35 బంతుల్లో 40 ప‌రుగులు ) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా బ్యాటింగ్ ఆర్డ‌ర్ పై ఇంగ్లాండ్ మాజీ ఆట‌గాడు కెవిన్ పీట‌ర్స‌న్ తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేశాడు.

గ‌త మ్యాచ్‌ల మాదిరిగానే మూడో టీ20లో ఓపెనర్లుగా సంజూ శాంసన్‌, అభిషేక్‌ శర్మ, వన్‌డౌన్‌లో కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్ వచ్చారు. ఇక నాలుగో స్థానంలో తిలక్‌ వర్మ వ‌చ్చారు. వీరిస్థానాల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే.. వెంట వెంట‌నే వికెట్లు ప‌డ‌డంతో హార్ధిక్ పాండ్యాను ఐదో స్థానానికి ప్ర‌మోట్ చేశారు. కానీ క్రీజులో నిల‌దొక్కుకునేందుకు చాలా బంతుల‌ను వృథా చేశాడు హార్దిక్. అదే స‌మ‌యంలో లెఫ్ట్, రైట్ కాంబినేష‌న్ కోసం ఆ త‌రువాత వాషింగ్టన్‌ సుందర్‌(6), అక్షర్‌ పటేల్‌(15)లను పంపించింది టీమ్ మేనేజ్‌మెంట్‌.

IND vs ENG : టీ20 అనుకున్న‌వా? టెస్టు అనుకున్న‌వా?.. హార్దిక్ పాండ్యాను ఏకిపారేస్తున్న నెటిజ‌న్లు..

బ్యాట‌ర్ అయిన ధ్రువ్ జురెల్‌ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చాడు. అత‌డు వ‌చ్చే స‌మ‌యానికి జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. ఓవ‌ర్‌కు 16 కు పైగా ప‌రుగులు చేయాల్సి ఉంది. తీవ్ర ఒత్తిడిలో అత‌డు నాలుగు బంతుల్లో 2 ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు. ఒక‌వేళ జురెల్ గ‌నుకు హార్దిక్ లేదా అక్ష‌ర్ ప‌టేల్ స్థానాల్లో పంపించి ఉంటే ఫ‌లితం మ‌రోలా ఉండే అవ‌కాశాలు లేక‌పోలేదు. దీనిపైనే ఇంగ్లాండ్ మాజీ ఆట‌గాడు కెవిన్ పీట‌ర్స‌న్ మాట్లాడాడు.

‘రాజ్‌కోట్ మ్యాచ్‌లో టీమ్ఇండియా బ్యాటింగ్ స‌రిగ్గా లేద‌ని అనిపిస్తోంది. ధ్రువ్ జురెల్‌ను ఎనిమిదో స్థానంలో పంప‌డం స‌రైంది కాదు. గంభీర్ నేతృత్వంలోని మేనేజ్‌మెంట్ బ్యాటింగ్ ఆర్డ‌ర్ పై దృష్టి పెట్టాలి. ఇప్ప‌టికే జురెల్ తానెంటో నిరూపించుకున్నాడు. రైట్‌, లెఫ్ట్ కాంబినేష‌న్ కోసం ప్ర‌య‌త్నం స‌రైంది కాదు. అత్యుత్త‌మ బ్యాట‌ర్ల‌ను ముందు వ‌ర‌స‌లో పంపించాలి.’ అని పీట‌ర్స‌న్ అన్నాడు.

IND vs ENG 3rd T20 : ఆ ఒక్క‌డి వ‌ల్లే ఓడిపోయాం.. లేదంటేనా.. కెప్టెన్ సూర్య‌కుమార్ యాదవ్ కామెంట్స్‌

ఇక నెటిజ‌న్లు కూడా పీట‌ర‌న్స్ అభిప్రాయంతో ఏకీ భ‌విస్తున్నారు. అన‌వ‌స‌ర ప్ర‌యాగాల‌కు పోయి గంభీర్ టీమ్ఇండియా కొంప ముంచుతున్నాడ‌ని మండిప‌డుతున్నారు.

రాజ్‌కోట్ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 171 ప‌రుగులు చేసింది. బెన్ డకెట్ (51; 28 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), లియామ్ లివింగ్‌స్టోన్ (43; 24 బంతుల్లో ఫోర్, 5 సిక్స‌ర్లు )లు రాణించారు. ల‌క్ష్య ఛేద‌న‌లో భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 146 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.