IND vs ENG : టీ20 అనుకున్న‌వా? టెస్టు అనుకున్న‌వా?.. హార్దిక్ పాండ్యాను ఏకిపారేస్తున్న నెటిజ‌న్లు..

రాజ్‌కోట్ మ్యాచ్‌లో టీమ్ఇండియా టాప్‌స్కోర‌ర్‌గా నిలిచిన‌ప్ప‌టికి హార్దిక్ పాండ్యాపై నెటిజ‌న్లు విరుచుకుప‌డుతున్నారు.

IND vs ENG : టీ20 అనుకున్న‌వా? టెస్టు అనుకున్న‌వా?.. హార్దిక్ పాండ్యాను ఏకిపారేస్తున్న నెటిజ‌న్లు..

Hardik Pandya slow innings in Rajkot match netiziens fire

Updated On : January 29, 2025 / 11:24 AM IST

రాజ్‌కోట్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భార‌త్ జ‌ట్టు 26 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్ర‌మంలో భార‌త ప‌ర్య‌ట‌న‌లో ఇంగ్లాండ్ జ‌ట్టు తొలి విజ‌యాన్ని అందుకుంది. భార‌త బ్యాట‌ర్ల‌లో హార్దిక్ పాండ్యా టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 35 బంతులు ఎదుర్కొన్న అత‌డు 114.29 స్ట్రైక్ రేటుతో 40 ప‌రుగులు చేశాడు. కాగా.. భార‌త జ‌ట్టు ఓట‌మికి గ‌ల కార‌ణాల‌లో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ కూడా ఒక‌టి. మిడిల్ ఓవ‌ర్ల‌లో ధాటిగా ఆడాల్సిన స‌మ‌యంలో చాలా నెమ్మ‌దిగా ఆడాడు. అంతేకాదండోయ్ స్ట్రైక్‌ను రొటేట్ చేయ‌డంలో విఫ‌లం అయ్యాడు. దీంతో నెటిజ‌న్లు సైతం హార్దిక్ ఇన్నింగ్స్ పై మండిప‌డుతున్నారు.

ల‌క్ష్య ఛేద‌న‌లో మిడిల్ ఓవ‌ర్లలో ఆటే మ్యాచ్‌ను దిశ‌ను నిర్దేశిస్తుంది. మిడిల్ ఓవ‌ర్ల‌లో స్ట్రైక్ రొటేట్ చేస్తూ సంద‌ర్భానుసారంగా బౌండ‌రీలు కొడుతూ ఉంటే ర‌న్‌రేట్ ఒత్త‌డి ప‌డ‌కుండా ఉంటుంది. అయితే.. రాజ్‌కోచ్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా డాట్‌బాల్స్ ఎక్కువ‌గా ఆడాడు. దీంతో ర‌న్‌రేట్ గ‌ణ‌నీయంగా పెరిగింది. 16 ఓవ‌ర్లు ముగిసే స‌రికి హార్దిక్ 27 బంతుల్లో 23 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. దీంతో చివ‌రి నాలుగు ఓవ‌ర్ల‌లో భార‌త్ 64 ప‌రుగులు చేయాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

IND vs ENG 3rd T20 : ఆ ఒక్క‌డి వ‌ల్లే ఓడిపోయాం.. లేదంటేనా.. కెప్టెన్ సూర్య‌కుమార్ యాదవ్ కామెంట్స్‌

ఇక ఆఖ‌రిలో మ‌రో ఎండ్‌లో బ్యాట‌ర్లు ఉన్నా కూడా సింగిల్స్ తీసేందుకు నిరాక‌రించాడు. తాను ఎక్కువ‌గా స్ట్రైకింగ్ చేయాల‌ని భావించ‌డం కూడా భార‌త్‌ను దెబ్బ‌తీసింది. ధోని త‌ర‌హాలో ఆఖ‌రి వ‌ర‌కు తీసుకువెళ్లి గెలిపించాల‌ని అనుకున్నాడు కానీ అందులో విఫ‌లం అయ్యాడు. దీంతో హార్దిక్ ఇన్నింగ్స్ పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

టీమ్ ఇండియా మాజీ ఆట‌గాడు పార్థివ్ ప‌టేల్‌, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీట‌ర్స‌న్ లు హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్‌ను త‌ప్పుబ‌ట్టారు. పొట్టి ఫార్మాట్‌లో క్రీజులో కుదురుకునేందుకు చాలా త‌క్కువ బంతుల‌ను మాత్ర‌మే తీసుకోవాలి. అంతేకానీ 20 నుంచి 25 బంతులు తీసుకుంటే మ్యాచ్‌లో ఆధిప‌త్యం చెలాయించ‌లేమ‌ని పార్థివ్ ప‌టేల్ అన్నాడు. పాండ్యా దూకుడుగా ఆడి ఉంటే బాగుండేది. ఆరంభంలో చాలా బంతుల‌ను అత‌డు వృథా చేశాడు. క‌నీసం స్ట్రైక్‌ను కూడా రొటేట్ చేయ‌డంతో విఫ‌లం అయ్యాడ‌ని చెప్పుకొచ్చాడు.

IND vs ENG : టీమ్ఇండియా ఓడిపోయినా.. చ‌రిత్ర సృష్టించిన వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి.. భార‌త బౌల‌ర్ల‌లో ఒకే ఒక్క‌డు..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. బెన్ డకెట్ (51; 28 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), లియామ్ లివింగ్‌స్టోన్ (43; 24 బంతుల్లో ఫోర్, 5 సిక్స‌ర్లు )లు రాణించ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం ల‌క్ష్య ఛేద‌న‌లో భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 146 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.