IND vs ENG : టీమ్ఇండియా ఓడిపోయినా.. చ‌రిత్ర సృష్టించిన వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి.. భార‌త బౌల‌ర్ల‌లో ఒకే ఒక్క‌డు..

మూడో టీ20 మ్యాచులో ఐదు వికెట్లు తీసి వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి అరుదైన ఘ‌న‌త సాధించాడు.

IND vs ENG : టీమ్ఇండియా ఓడిపోయినా.. చ‌రిత్ర సృష్టించిన వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి.. భార‌త బౌల‌ర్ల‌లో ఒకే ఒక్క‌డు..

Varun Chakravarthy creates history first indian bowler to took 10 plus wickets in a t20 series

Updated On : January 29, 2025 / 9:25 AM IST

సిరీస్‌లో నిల‌బ‌డాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజ‌యం సాధించింది. రాజ్‌కోట్ వేదిక‌గా జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 26 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. దీంతో ఈ సిరీస్‌లో భార‌త్ ఆధిక్యాన్ని 2-1 కి త‌గ్గించింది. ఈ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు ఓడిపోయిన‌ప్ప‌టికి టీమ్ఇండియా స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి రాణించాడు. ఇంగ్లాండ్ బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తూ ఐదు (5/24) వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ క్ర‌మంలో ఓ అరుదైన రికార్డును సాధించాడు.

స్వ‌దేశంలో ఓ ద్వైపాక్షిక సిరీసులో అత్య‌ధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. తొలి మ్యాచ్‌లో మూడు, రెండో టీ20లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. గ‌తంలో ఈ రికార్డు టీమ్ఇండియా స్పిన్న‌ర్లు ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, ర‌వి బిష్ణోయ్ పేరిట ఉండేది వారిద్ద‌రూ 9 వికెట్లు ప‌డ‌గొట్టారు.

IND vs ENG: ఔటైన తరువాత ఆగ్రహంతో ఊగిపోయిన హార్దిక్ పాండ్యా.. బ్యాట్ ను కిందపడేసి.. వీడియో వైరల్

స్వదేశంలో టీ20 సిరీస్‌లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్..

వరుణ్ చక్రవర్తి – 10 వికెట్లు (ఇంగ్లాండ్ పై) – 2025 (3 మ్యాచ్‌ల్లో)
ర‌విచంద్ర‌న్ అశ్విన్ – 9 వికెట్లు (శ్రీలంక పై) – 2016 (3 మ్యాచ్‌ల్లో)
ర‌వి బిష్ణోయ్ – 9 వికెట్లు (ఆస్ట్రేలియా పై) -2023 (5 మ్యాచ్‌ల్లో)
యుజ్వేంద్ర చాహల్ – 8 వికెట్లు (ఇంగ్లాండ్ పై) – 2017 (3 మ్యాచ్‌ల్లో)
యుజ్వేంద్ర చాహల్ – 8 వికెట్లు (శ్రీలంక) – 2017 (2 మ్యాచ్‌ల్లో)

వ‌రుణ్ సాధించిన మ‌రికొన్ని రికార్డులు..

* కాగా.. వ‌రుణ్ ఇది టీ20ల్లో రెండ‌వ ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న‌. గ‌తంలో ద‌క్షిణాఫ్రికాతో సిరీస్‌లోనూ ఓ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. ఈ క్ర‌మంలో వ‌రుస‌గా రెండు టీ20 సిరీస్‌ల‌లో ప‌ది లేదా అంత‌కంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి బౌల‌ర్‌గా నిలిచాడు.

Sunil Gavaskar : రోహిత్ శ‌ర్మ‌, య‌శ‌స్వి జైస్వాల్ ల‌పై సునీల్ గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌..

* టీమ్ఇండియా త‌రుపున టీ20 క్రికెట్‌లో రెండు సార్లు ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేసిన మూడో భార‌త బౌల‌ర్‌గా వ‌రుణ్ నిలిచాడు. అత‌డి కంటే ముందు కుల్దీప్ యాద‌వ్, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌లు ఈ ఘ‌న‌త సాధించారు.

మ్యాచ్ అనంత‌రం వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి మాట్లాడుతూ.. ఓట‌మి నుంచి పాఠాలు నేర్చుకుంటామ‌న్నాడు. తాము అనుకున్న విధంగా మ్యాచ్‌ను ముగించ‌లేక‌పోయామ‌ని చెప్పుకొచ్చాడు. ఆట‌ల్లో గెలుపోట‌ములు స‌హ‌జం అని చెప్పాడు. మ్యాచ్ ఫ‌లితం గురించి ఎక్క‌వగా ఆలోచించ‌కుండా త‌రువాతి మ్యాచ్ కోసం స‌న్న‌ద్ధం అవుతామ‌ని చెప్పుకొచ్చాడు. దేశం కోసం ఆడేట‌ప్పుడు ప్ర‌తి ఒక్క‌రు బాధ్య‌తాయుతంగా ఆడాల‌న్నాడు. ఫ్లిప్ప‌ర్ బంతుల‌ను వేసేందుకు తీవ్రంగా సాధ‌న చేసిన‌ట్లు తెలిపాడు.

గ‌తేడాది టీ20ల్లోకి పున‌రాగ‌మ‌నం చేసిన త‌రువాత వ‌రుణ్ 10 మ్యాచులు ఆడాడు. 27 వికెట్లు తీశాడు.