Sunil Gavaskar : రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ లపై సునీల్ గవాస్కర్ సీరియస్..
రంజీట్రోఫీలో పేలవ ప్రదర్శన చేసిన టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్ల పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు.

Sunil Gavaskar slams two Indian cricketers for their flop show in Ranji Trophy
ఇటీవల టెస్టు క్రికెట్‌లో భారత జట్టు ఘోర పరాజయాలను చవిచూసింది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ దేశవాళీలో తప్పని సరిగా ఆడాలని బీసీసీఐ ఓ నిబంధనను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చాన్నాళ్ల తరువాత భారత స్టార్ ఆటగాళ్లు అంతా రంజీట్రోఫీలో ఆడుతున్నారు. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్ అయ్యార్‌లు రంజీ మ్యాచ్‌లను ఆడగా ఇప్పడు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు సిద్ధం అవుతున్నారు.
వీరిలో ముంబై తరుపున రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్‌లు ఆడారు. జమ్ము కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 3, 28 పరుగులు చేయగా శ్రేయస్ 11, 17 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలం అయ్యారు. జైస్వాల్ ఓ మోస్తరుగా రాణించారు. ఈ మ్యాచ్‌లో జమ్ము కశ్మీర్ 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.
Dinesh Karthik : టీ20ల్లో ధోని రికార్డును బ్రేక్ చేసిన దినేశ్ కార్తీక్.. పరుగుల వీరుడు..
ఈ క్రమంలో టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్ల పై సునీల్ గవాస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్ పై ఎటాకింగ్ చేయాలనే రోహిత్, శ్రేయస్‌ల నిర్ణయాన్ని తప్పుపట్టాడు. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు శార్దూల్ ఠాకూర్, తనుష్ కొటియన్‌లను చూసి నేర్చుకోవాలని సూచించాడు.
ముంబై జట్టులో టీమ్ఇండియా టెస్టు బ్యాటర్లు ఔటైన తీరు ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దూకుడైన ఆటతీరు కారణంగా టెస్టు క్రికెట్ ప్రమాదంలో పడేలా కనిపిస్తోంద్నారు. ఫ్లాట్ పిచ్‌లపై వేగంగా ఆడితే బాగానే ఉంటుంది అంతేగానీ బౌలింగ్ పిచ్ పై ఆచితూచి ఆడాలన్నారు. మంచి బంతులను గౌరవించాలన్నారు. మంచి టెక్నిక్‌తో షాట్లు కొట్టాలన్నారు. అలాకాకుండా ప్రతి బౌండని బౌండరీకి తరలించాలనే ఉద్దేశ్యంతో ఆడితే గత టెస్టు సిరీస్‌లో ఎదురైన పరాజయాలే మరోసారి పలకరిస్తాయన్నాడు.
Virat Kohli : 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత రంజీల్లో కోహ్లీ.. మ్యాచ్‌ను లైవ్‌లో చూడొచ్చా?
ఓర్పు ప్రదర్శించాలి. కశ్మీర్‌తో మ్యాచ్‌లో మరో 50 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నారు. భారత స్టార్ ఆటగాళ్లు చూస్తుంటే కేవలం బీసీసీఐ కాంట్రాక్ట్‌ల నుంచి బయటకు వెళ్లిపోకుండా ఉండేందుకు మాత్రమే మ్యాచ్ ఆడినట్లుగా కనిపిస్తోందన్నాడు. గతంలో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడేందుకు నిరాకరించిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లను సెంట్రల్ కాంట్రాక్ట్‌ల నుంచి బీసీసీఐ తప్పించింది. అందుకనే ఇప్పుడు రోహిత్, యశస్విలు కాంట్రాక్ట్‌లు కోల్పోకుండా ఉండేందుకు ఆడినట్లుగా కనిపిస్తోందన్నారు.
రంజీల్లో రాణించిన సీనియర్ ఆటగాడు శార్దూల్ ఠాకూర్, యువ ప్లేయర్ తనుష్ కొటియన్ లపై దృష్టి సారించాలని గవాస్కర్ సూచించాడు.