Virat Kohli : 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత రంజీల్లో కోహ్లీ.. మ్యాచ్‌ను లైవ్‌లో చూడొచ్చా?
12 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత కోహ్లీ రంజీ ట్రోఫీలో పునరాగమనం చేస్తున్నాడు.

Will Delhi vs Railways match be live streame or not Kohli will return to Ranji Trophy after 12 years
దేశవాళీ క్రికెట్‌లో ప్రతి ఒక్కరూ ఆడాల్సిందేనని బీసీసీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌లు రంజీ ట్రోఫీ బరిలోకి దిగారు. ఇక ఇప్పుడు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత కోహ్లీ రంజీ ట్రోఫీలో పునరాగమనం చేస్తున్నాడు. జనవరి 30న రైల్వేస్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ తరుపున బరిలోకి దిగనున్నాడు. చివరి సారిగా కోహ్లీ 2012లో ఉత్తర ప్రదేశ్ పై రంజీ మ్యాచ్ ఆడాడు.
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులకు ఉచిత ప్రవేశాన్ని కల్పించింది ఢిల్లీ క్రికెట్ సంఘం. అయితే.. టీవీల్లో లేక ఓటీటీలో చూద్దాం అనే వారికి మాత్రం నిరాశే ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల రోహిత్ శర్మ ఆడిన మ్యాచ్‌కి బీసీసీఐ లైవ్ కవరేజీ ఇచ్చింది. అయితే.. అది ఓటీటీలో మాత్రమే. ఇప్పుడు కోహ్లీ ఆడే మ్యాచ్‌ను కనీసం ఓటీటీలో చూద్దాం అనుకుంటే నిరాశ తప్పకపోవచ్చునని తెలుస్తోంది.
వాస్తవానికి రంజీ ట్రోఫీలోని మ్యాచులను అన్నింటిని లైవ్ కవరేజీ చేయరు. రోస్టర్ పద్దతిలో కొన్ని మ్యాచులను మాత్రమే లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఉంటారు. దీనిపైనే ఢిల్లీ క్రికెట్ సంఘం స్పందించింది.
కొన్ని ముఖ్యమైన మ్యాచులకు లైవ్ టెలీకాస్ట్ లేదా ఓటీటీ స్ట్రీమింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో తమిళనాడుతో మ్యాచ్‌ను లైవ్ ఇచ్చారు. బ్రాడ్ కాస్టర్‌ను రోస్టర్ పద్దతిలో చేసేందుకు ముందుగానే నిర్ణయం తీసుకుంటారు. అయితే.. విరాట్ ఆడే మ్యాచ్ కాబట్టి చివరి నిమిషంలో బీసీసీఐ లైవ్ కవరేజీ ఏమైనా ఏర్పాట్లు చేస్తుందో లేదో చూడాలి. అని తెలిపింది.
ఫామ్ అందుకునేనా..
గత కొంతకాలంగా విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌తో కోహ్లీ ఇబ్బందులు పడుతున్నాడు. ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 23.75 సగటుతో 190 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉంది. తన ఫామ్ అందుకునేందుకు టీమ్ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ సాయం కోరాడు. బంగర్ పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.