IND vs ENG : ఇంగ్లాండ్‌తో మూడో టీ20 మ్యాచ్.. అరుదైన రికార్డు పై అర్ష్‌దీప్ సింగ్ కన్ను.. పాకిస్తాన్ పేసర్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేసేనా?
రాజ్‌కోట్ వేదికగా మంగళవారం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఓ అరుదైన రికార్డును సాధించే అవకాశం ఉంది.

Arshdeep Singh Eye on Pakistan pacer Haris Rauf World Record
రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో మంగళవారం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా ఎడమ చేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఓ అరుదైన రికార్డు పై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ రెండు వికెట్లు తీస్తే పురుషుల టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన పేసర్‌గా రికార్డులకు ఎక్కనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు పాకిస్థాన్ పేసర్ హరీస్ రవూఫ్ పేరిట ఉంది.
హరీస్ 71 టీ20 మ్యాచుల్లో 100 వికెట్లు తీశాడు. 2024 జూన్ లో న్యూయార్క్ వేదికగా కెనడాతో జరిగిన పురుషుల టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో రౌఫ్ ఈ మైలురాయిని సాధించాడు. ఇక అర్ష్‌దీప్ సింగ్ ఇప్పటి వరకు 62 టీ20 మ్యాచులు ఆడాడు. 98 వికెట్లు సాధించాడు. ఈ మ్యాచ్ కాకుండా భారత జట్టు ఇంగ్లాండ్‌తో మరో రెండు టీ20లు ఆడనుంది. ఈ క్రమంలో అర్ష్‌దీప్ సింగ్ ఈజీగానే ఈ రికార్డును అందుకునే అవకాశం ఉంది. అంతేకాదండోయ్.. పురుషుల క్రికెట్‌లో టీ20ల్లో టీమ్ఇండియా తరుపున వంద వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు. ఇప్పటికే అర్ష్‌దీప్ అత్యధిక వికెట్లు తీసిన భారత టీ20 బౌలర్‌గా కొనసాగుతున్నాడు.
ఇక ఓవరాల్‌గా పురుషుల టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన రికార్డు అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పేరిట ఉంది. రషీద్ కేవలం 54 మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించాడు. నేపాల్‌కు చెందిన సందీప్ లామిచానె, శ్రీలంకకు చెందిన వనిందు హసరంగా లు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నారు. ఇక భారత మహిళల విషయానికి వస్తే.. టీ20ల్లో వంద వికెట్ల తీసిన తొలి ప్లేయర్‌గా దీప్తి శర్మ చరిత్ర సృష్టించింది.
పురుషుల టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్లు..
రషీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్) – 53 మ్యాచ్‌లు (అక్టోబర్ 2021లో పాకిస్థాన్‌పై)
సందీప్ లామిచానే (నేపాల్) – 54 మ్యాచ్‌లు (జూన్ 2024లో బంగ్లాదేశ్‌పై)
వనిందు హసరంగా (శ్రీలంక) – 63 మ్యాచ్‌లు (ఫిబ్రవరి 2024లో అఫ్గానిస్థాన్ పై)
హారిస్ రౌఫ్ (పాకిస్థాన్) – 71 మ్యాచ్‌లు (జూన్ 2024లో కెనడాపై)
ఎహ్సాన్ ఖాన్ (హాంకాంగ్) – 71 మ్యాచ్‌లు (ఆగస్టు 2024లో మలేషియాపై)
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అర్ష్‌దీప్ సింగ్ రాణిస్తున్నాడు. ఆరంభ ఓవర్లలోనే వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్ పై ఒత్తిడి పెంచుతున్నాడు. తొలి టీ20లో రెండు వికెట్లు తీసిన అర్ష్‌దీప్ రెండో టీ20లో ఓ వికెట్ సాధించాడు.
ఇక సిరీస్ విషయానికి వస్తే.. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచుల్లోనూ గెలిచి భారత్ ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను ఇక్కడే సొంతం చేసుకోవాలని భారత్ ఆరాటపడుతోంది. మరోవైపు ఇంగ్లాండ్ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో నిలవాలనే పట్టుదలతో ఉంది.