IND vs ENG: ఔటైన తరువాత ఆగ్రహంతో ఊగిపోయిన హార్దిక్ పాండ్యా.. ఆ ఫ్రస్ట్రేషన్ వీడియో చూడండి..

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మంగళవారం రాత్రి మూడో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు 26 పరుగుల తేడాతో విజయం సాధించింది.

IND vs ENG: ఔటైన తరువాత ఆగ్రహంతో ఊగిపోయిన హార్దిక్ పాండ్యా.. ఆ ఫ్రస్ట్రేషన్ వీడియో చూడండి..

Hardik Pandya

Updated On : January 29, 2025 / 10:15 AM IST

IND vs ENG: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మంగళవారం రాత్రి మూడో టీ20 మ్యాచ్ రాజ్‌కోట్‌ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టుకు ఆదినుంచి ఎదురు దెబ్బలే తగిలాయి. ఓపెనర్లు వెంటవెంటనే ఔట్ కాగా.. మిగిలిన బ్యాటర్లుసైతం క్రీజులో నిలదొక్కుకోలేక పోయారు. దీంతో భారత్ జట్టు 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత జట్టులో హార్దిక్ పాండ్యా ఒక్కడే దూకుడుగా ఆడుతూ 40 పరుగులు చేశాడు. అయితే, హార్దిక్ ఔట్ అయిన తరువాత తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

Also Read: ICC AWARDS 2024 : ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌ జస్ప్రీత్ బుమ్రా..

టీమిండియా 16 పరుగుల వద్దే తొలివికెట్ ను కొల్పోయింది. ఓపెనర్ సంజూ శాంసన్ (3) ఔట్ అయ్యాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (14) పెవిలియన్ బాటపట్టాడు. తిలక్ వర్మ (18)సైతం దూకుడుగా ఆడే క్రమంలో తక్కువ పరుగులకే ఔట్ అయ్యాడు. అభిశే శర్మ 14బంతులు ఎదుర్కొని 24 పరుగులు చేశాడు. అయితే, హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో క్రీజులోకి వచ్చి దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పెంచే ప్రయత్నం చేశాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో పాండ్యాను జేమీ ఓవర్టన్ అవుట్ చేశాడు. ఓవర్లో మొదటి బాల్ ను హార్డిక్ సిక్స్ కొట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద బట్లర్ ఆ బాల్ ను క్యాచ్ అందుకున్నాడు. దీంతో హార్దిక్ తీవ్ర అసహనంతో పెవిలియన్ వైపు అడుగులు వేశాడు. అప్పటికి భారత్ జట్టు విజయంకోసం 11 బాల్స్ కు 41 పరుగులు చేయాల్సిన స్థితిలో ఉంది. హార్దిక్ పాండ్యా ఔట్ కాగానే బ్యాట్ ను పైకెత్తి గిరగిరా తిప్పుతూ కిందపడేశాడు. అంతేకాదు.. తీవ్ర అసహనంతో మైదానం విడిచి వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Sunil Gavaskar : రోహిత్ శ‌ర్మ‌, య‌శ‌స్వి జైస్వాల్ ల‌పై సునీల్ గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌..

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇప్పటికే రెండు మ్యాచ్ లు జరిగాయి. రెండింటిలో టీమిండియా విజయం సాధించింది. కోల్‌కతా వేదికగా జరిగిన మొదటి మ్యాచ్ లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై లో జరిగిన రెండో మ్యాచ్ లో రెండు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ జట్టు 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఇప్పటి వరకు ఈ సిరీస్ లో 2-1తో భారత్ జట్టు ముందంజలో ఉంది. నాల్గో టీ20 మ్యాచ్ జనవరి 31న పూణెలో జరగనుంది.