IND vs ENG 3rd T20 : ఆ ఒక్క‌డి వ‌ల్లే ఓడిపోయాం.. లేదంటేనా.. కెప్టెన్ సూర్య‌కుమార్ యాదవ్ కామెంట్స్‌

రాజ్‌కోట్ వేదిక‌గా జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భార‌త్ జ‌ట్టు ఓడిపోయింది. మ్యాచ్ అనంత‌రం ఓట‌మిపై కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ స్పందించాడు.

IND vs ENG 3rd T20 : ఆ ఒక్క‌డి వ‌ల్లే ఓడిపోయాం.. లేదంటేనా.. కెప్టెన్ సూర్య‌కుమార్ యాదవ్ కామెంట్స్‌

Suryakumar Yadav comments after india loss to england in 3rd T20 match in Rajkot

Updated On : January 29, 2025 / 10:15 AM IST

మ‌రో రెండు మ్యాచులు మిగిలి ఉండ‌గానే సిరీస్‌ను సొంతం చేసుకోవాల‌ని భావించిన టీమ్ఇండియాకు షాక్ త‌గిలింది. సిరీస్‌లో నిల‌బ‌డాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ స‌త్తా చాటింది. రాజ్‌కోట్ వేదిక‌గా జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 26 ప‌రుగుల తేడాతో ఇంగ్లాండ్ విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-2తో నిలిచింది. ఇక ఈ మ్యాచ్‌లో భార‌త ఓట‌మి పై కెప్టెన్‌ సూర్య‌కుమార్ యాద‌వ్ స్పందించాడు. ఇంగ్లాండ్ స్పిన్న‌ర్ ఆదిల్ ర‌షీద్ స్పెల్ కార‌ణంగానే ఓడిపోయామ‌న్నాడు.

ఈ మ్యాచ్‌లో ఆదిల్ ర‌షీద్ నాలుగు ఓవ‌ర్లు వేశాడు. 15 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి ఓ వికెట్ తీశాడు. అత‌డు తీసింది మామూలు వికెట్ కాదు. భీక‌ర ఫామ్‌లో ఉన్న తిల‌క్ వ‌ర్మ (15)ను క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్‌ను ఇంగ్లాండ్ వైపు తిప్పాడు.

IND vs ENG : టీమ్ఇండియా ఓడిపోయినా.. చ‌రిత్ర సృష్టించిన వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి.. భార‌త బౌల‌ర్ల‌లో ఒకే ఒక్క‌డు..

ఓట‌మిపై సూర్య కామెంట్స్..

మ్యాచ్ ఓట‌మిపై సూర్య‌కుమార్ మాట్లాడుతూ.. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంద‌ని తాను భావించిన‌ట్లు చెప్పాడు. ‘హార్దిక్ పాండ్య, అక్ష‌ర్ ప‌టేల్ లు క్రీజులో ఉన్నంత వ‌ర‌కు మా చేతుల్లోనే ఉంద‌నుకున్నా. తిల‌క్ వ‌ర్మ దూకుడుగానే ఆడాడు.’ అని అన్నాడు. ఇక మ్యాచ్ గెలుపు క్రికెట్ ఆదిల్ ర‌షీద్‌కు ద‌క్కుతుందన్నాడు. అత‌డు చాలా అద్భుతంగా బంతులు వేయాడ‌ని కొనియాడాడు. బౌండ‌రీ కొట్ట‌డం సంగ‌తి అటుంచితే క‌నీసం స్ట్రైక్ రొటేట్ చేయ‌నీయ‌కుండా బంతులు వేశాడ‌న్నారు. అందుకే అతను వరల్డ్ క్లాస్ బౌలర్ అయ్యాడు అని చెప్పుకొచ్చాడు.

ఇక జ‌ట్టులో ఎక్కువ మంది స్పిన్న‌ర్ల‌ను తీసుకోవడం పైనా స్పందించాడు. పిచ్ నుంచి స్పిన్న‌ర్ల‌కు ఎక్కువ స‌హ‌కారం ల‌భిస్తుంద‌నే ఉద్దేశంతోనే తీసుకున్న‌ట్లుగా తెలిపాడు. బౌలింగ్ విభాగం చ‌క్క‌గా త‌మ ప‌నిని నిర్వ‌ర్తిస్తోంద‌ని, ఎలాంటి ఇబ్బంది లేద‌న్నాడు. బ్యాటింగ్ విభాగం పై ఫోక‌స్ చేయాల్సి ఉంద‌న్నాడు. ఇంకా మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు. ఓట‌మి నుంచి పాఠాలు నేర్చుకుంటామ‌ని, త‌దుప‌రి మ్యాచ్‌ల్లో ఇలాంటి త‌ప్పుల‌ను పున‌రావృతం కాకుండా చూసుకుంటామ‌ని సూర్య‌కుమార్ యాద‌వ్ తెలిపాడు.

IND vs ENG: ఔటైన తరువాత ఆగ్రహంతో ఊగిపోయిన హార్దిక్ పాండ్యా.. బ్యాట్ ను కిందపడేసి.. వీడియో వైరల్

ఇక ఇరు జ‌ట్ల మ‌ధ్య జ‌న‌వ‌రి 31(శుక్ర‌వారం) నాలుగో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఇంగ్లాండ్ జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాట‌ర్లో బెన్ డకెట్ (51; 28 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కం చేశాడు. లియామ్ లివింగ్‌స్టోన్ (43; 24 బంతుల్లో ఫోర్, 5 సిక్స‌ర్లు ) వేగంగా ఆడాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు ప‌డ‌గొట్టాడు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ సాధించారు.

అనంతరం ల‌క్ష్య ఛేద‌న‌లో భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 146 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా (40), అభిషేక్ శర్మ(24) మినహా మిగిలిన వారంతా విప‌లం అయ్యాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో జామీ ఓవర్టన్ మూడు వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్ చెరో రెండేసి వికెట్లు తీశారు. మార్క్ వుడ్‌‌కు ఓ వికెట్ సాధించాడు.