Major League Cricket 2025 winner is MI New York
మేజర్ లీగ్ క్రికెట్ 2025 విజేతగా ఎంఐ న్యూయార్క్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ పై 5 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో ఎంఐ న్యూయార్క్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఎంఐ బ్యాటర్లలో క్వింటన్ డికాక్ (77; 46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. మోనాక్ పటేల్ (28), కున్వార్‌జీత్ సింగ్ (22 నాటౌట్) లు రాణించారు. వాషింగ్టన్ ఫ్రీడమ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ మూడు వికెట్లు తీశాడు. నేత్రావల్కర్, మ్యాక్స్‌వెల్, జాక్ ఎడ్వర్డ్స్, హోలాండ్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
Wimbledon 2025 : వింబుల్డన్ విజేతగా యానిక్ సినర్.. ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
ఆ తరువాత భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన వాషింగ్టన్‌కు మొదటి బంతికే షాక్ తగిలింది. ఓపెనర్ మిచెల్ ఓవెన్ (0), వన్‌డౌన్‌లో వచ్చిన ఆండ్రీస్ గౌస్ (0) లు తొలి ఓవర్‌లోనే డకౌట్లుగా బౌల్ట్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరుకున్నారు. అయితే.. మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర (70; 41 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), జాక్ ఎడ్వర్డ్స్ (33) మూడో వికెట్‌కు 45 బంతుల్లోనే 84 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.
CHAMPIONS 🏆 pic.twitter.com/pWkAxkAJwr
— Cognizant Major League Cricket (@MLCricket) July 14, 2025
ఎడ్వర్డ్స్ ఔటైనప్పటికీ గ్లెన్ ఫిలిప్స్ (48*)తో కలిసి రచిన్ నాలుగో వికెట్ కు 46 పరుగుల కీలక భాగస్వామ్యం నిర్మించాడు. కానీ.. రచిన్ ఔటయ్యాక వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ (16 బంతుల్లో 15) వేగంగా ఆడలేకపోయాడు. అంతేకాదండోయ్ కీలక సమయంలో ఔటైయ్యాడు. ఆఖరి ఓవర్‌లో 12 పరుగులు అవసరం కాగా.. గ్లెన్ ఫిలిప్స్ కు కేవలం ఒక్క బంతిని ఆడే అవకాశం మాత్రమే వచ్చింది.
ENG vs IND : లార్డ్స్‌లో టీమ్ఇండియా విజయవంతమైన లక్ష్య ఛేదన ఎంతో తెలుసా? వార్నీ ఇప్పుడెలా..
వాషింగ్టన్ లక్ష్య ఛేదనలో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులకే పరిమితమైంది. ఎంఐ న్యూయార్క్ బౌలర్లలో బౌల్ట్, రుషి ఉగార్కర్ చెరో రెండు వికెట్లు తీశారు. కెంజిగె ఓ వికెట్ సాధించాడు.