Wimbledon 2025 : వింబుల్డన్ విజేత‌గా యానిక్‌ సినర్‌.. ప్రైజ్‌మ‌నీ ఎంతో తెలుసా?

ప్రతిష్టాత్మక వింబుల్డన్ 2025 గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ విజేత‌గా ప్ర‌పంచ‌ నెంబర్ వన్, ఇటలీ స్టార్ జానిక్ సినెర్ నిలిచాడు.

Wimbledon 2025 : వింబుల్డన్ విజేత‌గా యానిక్‌ సినర్‌.. ప్రైజ్‌మ‌నీ ఎంతో తెలుసా?

Jannik Sinner beats Carlos Alcaraz to win his first Wimbledon title

Updated On : July 14, 2025 / 9:38 AM IST

ప్రతిష్టాత్మక వింబుల్డన్ 2025 గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ విజేత‌గా ప్ర‌పంచ‌ నెంబర్ వన్, ఇటలీ స్టార్ జానిక్ సినెర్ నిలిచాడు. ఆదివారం జ‌రిగిన పురుషుల సింగిల్స్ ఫైన‌ల్ మ్యాచ్‌లో 4-6, 6-4, 6-4, 6-4 తేడాతో డిఫెండింగ్ ఛాంపియ‌న్ కార్లోస్ అల్క‌రాస్ పై గెలుపొందాడు. ఈ విజ‌యంతో గ‌త నెలలో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్ర‌తికారం తీర్చుకున్నాడు. కాగా.. ఫైన‌ల్ మ్యాచ్‌లో ఓట‌మితో హ్యాట్రిక్ వింబుల్డన్ టైటిల్స్‌ను గెలవాలనే అల్కరాజ్ కల చెదిరిపోయింది.

ఈ మ్యాచ్ దాదాపు మూడు గంట‌ల 4 నిమిషాల పాటు సాగింది. తొలి సెట్ ఆరంభంలో సిన‌ర్ దూకుడుగా ఆడాడు. అయితే.. గ్రేమ్‌లో అత‌డికి బ్రేక్ ల‌భించ‌డంతో 4-2తో సెట్ దిశ‌గా సాగాడు. అయితే.. అద్భుతంగా పుంజుకున్న అల్క‌రాజ్ బ‌ల‌మైన బేస్‌లైన్ ఆట‌తో అద‌ర‌గొట్టాడు. తొలి సెట్‌ను 6-4తో గెలుచుకున్నాడు.

ENG vs IND : లార్డ్స్‌లో టీమ్ఇండియా విజ‌య‌వంత‌మైన ల‌క్ష్య ఛేద‌న ఎంతో తెలుసా? వార్నీ ఇప్పుడెలా..

అయితే.. తొలి సెట్‌లో ఓడిపోయిన‌ప్ప‌టికి ఆ త‌రువాత సిన‌ర్ చాలా బ‌లంగా పుంజుకున్నాడు. వ‌రుస‌గా మూడు సెట్ల‌ను గెలుచుకుని ఫైన‌ల్ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డంతో పాటు తొలి వింబుల్డ‌న్ ట్రోఫీని గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ 15 ఏస్‌లు సంధించి 7 డబుల్ పాల్ట్స్ చేశాడు. మరోవైపు జానిక్ సిన్నర్ 8 ఏస్‌లు సంధించి.. 2 డబుల్ ఫాల్ట్స్ మాత్రమే నమోదు చేశాడు.

ENG vs IND : భార‌త్‌కు ఇంగ్లాండ్‌ కోచ్ వార్నింగ్‌.. తొలి గంట‌లోనే ఆరు వికెట్లు తీస్తాం.. కాస్కోండి

ఇక విజేతగా నిలిచిన సినర్‌కు రూ.34 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. రన్నరప్ అల్కరాజ్‌ రూ. 17.65 కోట్ల ప్రైజ్‌మనీ అందుకోనున్నాడు.