Jannik Sinner beats Carlos Alcaraz to win his first Wimbledon title
ప్రతిష్టాత్మక వింబుల్డన్ 2025 గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ విజేతగా ప్రపంచ నెంబర్ వన్, ఇటలీ స్టార్ జానిక్ సినెర్ నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో 4-6, 6-4, 6-4, 6-4 తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాస్ పై గెలుపొందాడు. ఈ విజయంతో గత నెలలో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతికారం తీర్చుకున్నాడు. కాగా.. ఫైనల్ మ్యాచ్‌లో ఓటమితో హ్యాట్రిక్ వింబుల్డన్ టైటిల్స్‌ను గెలవాలనే అల్కరాజ్ కల చెదిరిపోయింది.
ఈ మ్యాచ్ దాదాపు మూడు గంటల 4 నిమిషాల పాటు సాగింది. తొలి సెట్ ఆరంభంలో సినర్ దూకుడుగా ఆడాడు. అయితే.. గ్రేమ్‌లో అతడికి బ్రేక్ లభించడంతో 4-2తో సెట్ దిశగా సాగాడు. అయితే.. అద్భుతంగా పుంజుకున్న అల్కరాజ్ బలమైన బేస్‌లైన్ ఆటతో అదరగొట్టాడు. తొలి సెట్‌ను 6-4తో గెలుచుకున్నాడు.
ENG vs IND : లార్డ్స్‌లో టీమ్ఇండియా విజయవంతమైన లక్ష్య ఛేదన ఎంతో తెలుసా? వార్నీ ఇప్పుడెలా..
Jannik Sinner is a Wimbledon champion 🇮🇹
The world No.1 defeats Carlos Alcaraz 4-6, 6-4, 6-4, 6-4 to win the 2025 Gentlemen’s Singles Trophy 🏆#Wimbledon pic.twitter.com/UMnwV4Fw78
— Wimbledon (@Wimbledon) July 13, 2025
అయితే.. తొలి సెట్‌లో ఓడిపోయినప్పటికి ఆ తరువాత సినర్ చాలా బలంగా పుంజుకున్నాడు. వరుసగా మూడు సెట్లను గెలుచుకుని ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించడంతో పాటు తొలి వింబుల్డన్ ట్రోఫీని గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ 15 ఏస్‌లు సంధించి 7 డబుల్ పాల్ట్స్ చేశాడు. మరోవైపు జానిక్ సిన్నర్ 8 ఏస్‌లు సంధించి.. 2 డబుల్ ఫాల్ట్స్ మాత్రమే నమోదు చేశాడు.
ENG vs IND : భారత్‌కు ఇంగ్లాండ్ కోచ్ వార్నింగ్.. తొలి గంటలోనే ఆరు వికెట్లు తీస్తాం.. కాస్కోండి
ఇక విజేతగా నిలిచిన సినర్‌కు రూ.34 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. రన్నరప్ అల్కరాజ్ రూ. 17.65 కోట్ల ప్రైజ్‌మనీ అందుకోనున్నాడు.