Football
Mason Mount Gives Jersey : పలు రంగాల్లో ఉన్న వారికి ఎంతో మంది అభిమానులు ఉంటారు. వారిని చూడాలని, వారితో ఒక్క సెల్ఫీ లేదా ఆటోగ్రాఫ్ దిగాలని చాలా మంది అనుకుంటుంటారు. కానీ..ఈ అవకాశం కొంతమంది మాత్రమే దక్కుతుంటుంది. కొంతమందికి మాత్రం వారు అనుకోకుండానే..ఆశ్చర్యకరంగా తాము అభిమానించే..వ్యక్తే ఇంటికి రావడం లేదా గిఫ్ట్ పంపించడంతో వారు తీవ్ర భావోద్వేగానికి లోనవుతుంటారు. ఇలాగే..జరిగింది UEFA 2020 ఛాంపియన్ షిప్ యూరో కప్ 2020లో. ఇంగ్లండ్ – డెన్మార్క్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Read More : Drunk Buffaloes: మద్యం దాచుకున్న రైతులు..తాగేసిన గేదెలు..వింత వింత ప్రవర్తన
ఇంగ్లండ్ ఫుట్ బాలర్ మాసన్ మౌంట్ కీలకంగా వ్యవహరించాడు. మ్యాచ్ విజయంతో పాటు..అభిమానుల మనస్సులు గెలుచుకున్నాడు. ఇంగ్లండ్ 2-1 తేడాతో డెన్మార్క్ పై విజయం సాధించింది. 55 ఏళ్ల తర్వాత..మరో మెగాటోర్నీలో ఫైనల్ కు అడుగుపెట్టడం..ఈ చిరస్మరణీయమైన విజయాన్ని అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేశారు. మ్యాచ్ అనంతరం మౌంట్..ప్రేక్షకులు కూర్చొనే ఓ గ్యాలరీ వద్దకు వచ్చాడు. అక్కడ ఓ అమ్మాయికి తన జెర్సీని ఇచ్చాడు. వెంటనే అది అందుకుని గుక్క ఏడుపు పెట్టింది.
Read More : Pandemic Bonus : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అకౌంట్లలో రూ.లక్ష బోనస్.. ఏ క్షణమైనా పడొచ్చు!
తన తండ్రిని హద్దుకుని బిగ్గరగా ఏడ్చేసింది. దీనికి సంబంధించిన ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ గా మారింది. రెమ్ విలియ్స్ అనే వ్యక్తి తన ట్విటర్ వేదికగా ట్వీట్ చేయగా…7.2 మిలియన్ వ్యూస్ రాగా.. వేల సంఖ్యలో లైక్‌లు, కామెంట్లు వచ్చాయి.
This moment had me ? @masonmount_10 ?? pic.twitter.com/tzWWlPijW6
— Rem Williams (@remmiewilliams) July 8, 2021