Pandemic Bonus : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అకౌంట్లలో రూ.లక్ష బోనస్.. ఏ క్షణమైనా పడొచ్చు!

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరోనా కష్టకాలంలో ఉద్యోగులకు లక్ష రూపాయల వరకు బోనస్‌గా రానుంది. ఏ క్షణమైనా అకౌంట్లలో డబ్బులు పడొచ్చు.. అందరికి కాదండోయ్..

Pandemic Bonus : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అకౌంట్లలో రూ.లక్ష బోనస్.. ఏ క్షణమైనా పడొచ్చు!

Top It Company Giving 1 Lakh Cash Pandemic Bonus To Employees

Pandemic Bonus : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరోనా కష్టకాలంలో ఉద్యోగులకు లక్ష రూపాయల వరకు బోనస్‌గా రానుంది. ఏ క్షణమైనా అకౌంట్లలో డబ్బులు పడొచ్చు.. అందరికి కాదండోయ్.. టాప్ ఐటీ కంపెనీకి చెందిన ఉద్యోగులకు మాత్రమే.. అవును మీరు విన్నది నిజమే.. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉద్యోగులకు ఈ బోనస్ అందనుంది. మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు పాండామిక్ బోనస్ కింద రూ.లక్ష అందించనుంది.

కరోనా వైరస్ కష్టకాలంలో తమ ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారికి చేయూత అందించాలని నిర్ణయించింది. జూలై నెల లేదా ఆగస్ట్ నెలలో ఈ బోనస్ డబ్బులు అమెరికా, విదేశీ మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల అకౌంట్లలోకి పడనున్నాయి. కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి దిగువున్న ఉండే అందరి స్టాఫ్ కి ఈ బోనస్ గిఫ్ట్ గా మైక్రోసాఫ్ట్ అందించనుంది.

మార్చి 31, 2021 ముందు లేదా ఆ తర్వాత చేరిన కంపెనీ సిబ్బందికి ఈ ఆఫర్ వర్తించనుంది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ కంపెనీలో 1,75,508 మంది ఉద్యోగులు ఉన్నారు. మైక్రోసాఫ్ట్ అందించబోయే ఈ బోనస్ 200 మిలియన్ డాలర్లతో కంపెనీపై భారం పడనుంది. మైక్రోసాఫ్ట్ లోని GitHub, LinkedIn, and Zenimaxలో పని చేసే ఉద్యోగులకు ఈ బోనస్ వర్తించదు.