8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ రిలీఫ్.. 8వ వేతన సంఘంపై కీలక ప్రకటన.. ఇక పండగ చేస్కోండి..!

8th Pay Commission : మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలక ప్రకటన చేసింది.

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ రిలీఫ్.. 8వ వేతన సంఘంపై కీలక ప్రకటన.. ఇక పండగ చేస్కోండి..!

8th Pay Commission

Updated On : September 12, 2025 / 3:44 PM IST

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఉపశమనం లభించనుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అతి త్వరలో 8వ వేతన సంఘం ఏర్పాటు చేయబోతుంది. నెలల తరబడి ఊహాగానాలు, దీర్ఘకాల నిరీక్షణకు ముగింపు పలుకుతూ 8వ కేంద్ర వేతన సంఘం (CPC) త్వరలో ఏర్పాటు చేయనున్నట్టు  ధృవీకరించింది. కమిషన్ ఏర్పాటుతో పాటు, పాత పెన్షన్ పథకం (OPS) పునరుద్ధరణపై కూడా చర్చలు జరగనున్నాయి.

ప్రభుత్వ హామీ :
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులు 8వ వేతన సంఘం (8th Pay Commission) కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. 8వ కేంద్ర వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో చర్చిస్తోందని తెలిపింది. ఈ కమిషన్ ఏర్పాటుకు సంబంధించి త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

నివేదిక ప్రకారం.. గత నెలలో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ (GENC) ప్రతినిధి బృందం కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ను కలిసింది. 8వ వేతన సంఘం ప్రకటన త్వరలోనే వస్తుందని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఉద్యోగి ప్రతినిధులకు హామీ ఇచ్చారు. OPS పునరుద్ధరణపై చర్చేందుకు పెన్షన్ కార్యదర్శితో సమావేశం కూడా ఏర్పాటైంది.

ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు :

ఉద్యోగుల డిమాండ్లు పెరిగాయి. ఈ సమావేశంలో ప్రతినిధి బృందం అనేక ప్రధాన అంశాలను లేవనెత్తుతూ వివరణాత్మక మెమోరాండంను సమర్పించింది. అందులో ముఖ్యంగా 8వ వేతన సంఘాన్ని త్వరగా ఏర్పాటు చేయాలి. జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS), ఏకీకృత పెన్షన్ పథకం (UPS)లను రద్దు చేయాలి. పాత పెన్షన్ పథకం (OPS) పునరుద్ధరించాలి. కోవిడ్-19 సమయంలో ఆగిపోయిన 18 నెలల డీఏ వాయిదాలను చెల్లించాలి.

Read Also : Apple iPhone 17 Pre-orders : గెట్ రెడీ.. ఆపిల్ ఐఫోన్ 17 ప్రీ-ఆర్డర్లు ఈరోజు నుంచే.. ధర, ఆఫర్లు ఇవే.. ఇండియాలో ఎక్కడ కొనాలి?

అంతేకాదు.. కారుణ్య నియామకం, కేడర్ రివ్యూ, రెగ్యులర్ JCM సమావేశాల అంశాన్ని కూడా లేవనెత్తారు. ఈ సమావేశంలో మంత్రి జితేంద్ర సింగ్ 8వ వేతన సంఘం త్వరలో ఏర్పాటు చేయబడుతుందని హామీ ఇచ్చారు. ఉద్యోగుల డిమాండ్లను పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. ముఖ్యంగా పెన్షన్‌కు సంబంధించిన అంశాలను పెన్షన్ కార్యదర్శితో వెంటనే చర్చిస్తామన్నారు.

8వ వేతన సంఘం ఎందుకంటే? :
దేశంలో ప్రతి 10 ఏళ్లకు ఒక కొత్త వేతన సంఘం ఏర్పాటు చేస్తారు. చివరిసారిగా 7వ వేతన సంఘం అమలుతో ఉద్యోగుల ప్రాథమిక జీతం, భత్యాలు, పెన్షన్‌లో భారీ మార్పు వచ్చింది. ఇప్పుడు 8వ వేతన సంఘం ఉద్యోగుల ఆదాయాన్ని మరింత పెరుగుతుందని, ద్రవ్యోల్బణం ఒత్తిడిని తగ్గిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుత ఖర్చులు, బాధ్యతలను పరిగణనలోకి తీసుకుంటే కొత్త వేతన సంఘం చాలా ముఖ్యమని ఉద్యోగులు చెబుతున్నారు.

కొన్ని అలవెన్సుల తొలగింపు :
ఈసారి కేంద్ర ప్రభుత్వం కొన్ని పాత, చిన్న స్థాయి అలవెన్సులను తొలగించవచ్చని అనేక నివేదికలు పేర్కొన్నాయి. ఇందులో ట్రావెల్ అలవెన్స్, స్పెషల్ డ్యూటీ అలవెన్స్, టైపింగ్/క్లరికల్ వంటి పాత అలవెన్సులు ఉండవచ్చు. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. వేతన నిర్మాణాన్ని సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.

ఉద్యోగులకు ప్రయోజనాలేంటి? :
8వ వేతన సంఘం అమలైతే.. ఉద్యోగులు ప్రాథమిక జీతం, పెన్షన్ రెండింటిలోనూ భారీ ప్రయోజనం పొందుతారు. అలవెన్సుల పెరుగుదలతో నెలవారీ ఆదాయం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా పెన్షనర్లకు ఈ పథకం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం త్వరలో 8వ వేతన సంఘాన్ని ప్రకటిస్తే.. లక్షలాది కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.