IPL 2025 : ఐపీఎల్ 18వ సీజ‌న్‌కు ముందు ల‌క్నోకు భారీ ఎదురుదెబ్బ‌.. కొత్త కెప్టెన్ పంత్ ఏం చేస్తాడో..?

ఐపీఎల్ 2025 సీజ‌న్ ఆరంభానికి ముందే ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ త‌గిలింది.

Massive Blow to LSG star pacer miss first half of IPL 2025 due to injury reports

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 ముగిసింది. భారత జ‌ట్టు విజేత‌గా నిలించింది. ఇక ఇప్పుడు అంద‌రి దృష్టి ఐపీఎల్ పై ప‌డింది. ఐపీఎల్ 18వ సీజ‌న్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. మే 25 వ‌ర‌కు ఈ మెగా టోర్నీ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే అన్ని ఫ్రాంచైజీల‌కు సంబంధించిన ఆట‌గాళ్లు ఆయా జ‌ట్ల ట్రైనింగ్ సెష‌న్‌ల‌కు చేరుకుంటున్నారు. ఛాంపియ‌న్స్ ట్రోఫీ ముగియ‌డంతో భార‌త ఆట‌గాళ్లు కూడా ఒక్కొక్క‌రిగా ఐపీఎల్ జ‌ట్ల‌తో చేరుతున్నారు.

అయితే.. ఐపీఎల్ 2025 సీజ‌న్ ఆరంభానికి ముందే ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ బౌల‌ర్, యువ పేస‌ర్ మ‌యాంక్ యాద‌వ్‌ ఐపీఎల్ 18వ సీజ‌న్ ఫ‌స్టాఫ్‌కు దూరం కానున్నాడని వార్త‌లు వ‌స్తున్నాయి. అత‌డు వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకోలేద‌ని క్రిక్ఇన్‌ఫో త‌న క‌థ‌నంలో తెలిపింది.

Rashid Latif : మీ బండారం మొత్తం బ‌య‌ట‌పెడుతూ.. బుక్ రాస్తున్నా.. ఎవ‌రు, ఎప్పుడు, ఎలా.. పాక్ మాజీ కెప్టెన్ వార్నింగ్‌..

ప్ర‌స్తుతం మ‌యాంక్ బెంగ‌ళూరులోని బీసీసీఐ సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో పున‌రావాసం పొందుతున్నాడు. ఇటీవ‌లే అత‌డు ప్రాక్టీస్ మొద‌లు పెట్టిన‌ట్లుగా తెలుస్తోంది. అత‌డు ఫిట్‌నెస్ సాధిస్తే ఐపీఎల్ 2025 సీజ‌న్ సెకండ్ ఆఫ్ నుంచి అందుబాటులోకి వ‌స్తాడు అని ఎన్‌సీఏ వ‌ర్గాలు తెలిపాయి.

గతేడాది బంగ్లాదేశ్‌తో జ‌రిగిన టీ20 సిరీస్ సిరీస్ ద్వారా మ‌యాంక్ యాద‌వ్ అంతర్జాతీయ టీ20ల్లో అరంగ్రేటం చేశాడు. 3 మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో అత‌డి వెన్నుగాయం తిర‌గ‌బెట్టింది. దీంతో గంట‌కు 150 కిలోమీట‌ర్ల‌కు పైగా వేగంతో బౌలింగ్ చేసే అత‌డు ఆరు నెల‌లుగా ఆట‌కు దూరంగా ఉంటున్నాడు.

కాగా.. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ రూ.11 కోట్ల‌కు అత‌డి రిటైన్ చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు మయాంక్ 4 ఐపీఎల్ మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడాడు. 7 వికెట్లు తీశాడు.

Rohit sharma : ఏమ‌య్యా రోహిత్ ఏందిది.. ఫోన్‌, పాస్‌పోర్టు గ‌తం.. ఛాంపియ‌న్స్ ట్రోఫీని కూడానా..

ఇదిలా ఉంటే.. రిష‌బ్ పంత్ సార‌థ్యంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ బ‌రిలోకి దిగ‌నుంది. మెగావేలంలో అత‌డిని ల‌క్నో రూ.27 కోట్ల‌కు ద‌క్కించుకుంది.

లక్నో సూపర్ జెయింట్స్ జ‌ట్టు ఇదే..

రిషభ్ పంత్ (కెప్టెన్), నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్, ఎయిడెన్ మార్క్‌రమ్, హిమ్మత్ సింగ్, ఆయుష్ బదోని, మాథ్యూ బ్రీట్జ్కీ, ఆర్యన్ జుయల్, మిచెల్ మార్ష్, షాబాజ్ అహ్మద్, యువరాజ్ చౌదరీ, అబ్దుల్ సమద్, రాజవర్దన్ హంగార్గేకర్, అర్శిన్ కులకర్ణి, ఆవేశ్ ఖాన్, ఆకాశ్ దీప్, ప్రిన్స్ యాదవ్, మొహిసిన్ ఖాన్, షమార్ జోసఫ్, ఆకాశ్ సింగ్, మయాంక్ యాదవ్, మణిమారన్ సిద్దార్థ్, దిగ్వేశ్ సింగ్, రవి బిష్ణోయ్.