Rohit sharma : ఏమయ్యా రోహిత్ ఏందిది.. ఫోన్, పాస్‌పోర్టు గతం.. ఛాంపియన్స్ ట్రోఫీని కూడానా..
రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Rohit Sharma Forgot Champions Trophy after press conference
దాదాపు 12 ఏళ్ల తరువాత భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచింది. ఈ క్రమంలో ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ కీలక ఇన్నింగ్స్ ఆడి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ అప్పుడప్పుడు తన పాస్‌పోర్టు, ఫోన్, ఇతర వస్తువులను మరిచిపోతుంటాడు అని తోటి ఆటగాళ్లు పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. మిగిలిన వాటి సంగతి ఎలా ఉన్న సరే.. ఆదివారం ఫైనల్ మ్యాచ్ ముగిసిన తరువాత విలేకరుల సమావేశంలో పాల్గొన్న రోహిత్ శర్మ.. మీడియా రూమ్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీని మర్చిపోయాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మీడియా సమావేశంలో రోహిత్ శర్మ పలు ఆసక్తికర విషయాలను మాట్లాడాడు. తన రిటైర్‌మెంట్ పై వస్తున్న వార్తలపై స్పందించాడు. తనకు ఇప్పట్లో వన్డేలకు వీడ్కోలు పలికే ఆలోచన లేదన్నాడు. ఇలాంటి వార్తలను వ్యాప్తి చేయవద్దని కోరారు.
విలేకరుల సమావేశం ముగిసిన తరువాత రోహిత్ శర్మ తనతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని తీసుకువెళ్లడం మరిచిపోయాడు. సహాయక సిబ్బందిలోని ఓ సభ్యుడు దీన్ని గుర్తించి.. ట్రోఫీని తీసుకువెళ్లి హిట్‌మ్యాన్‌కు అందజేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారగా.. నెటిజన్లు ఏందయ్యా రోహిత్.. ఇలాగైతే ఎలా చెప్పు.. కష్టపడి గెలిచిన ట్రోఫీని మరిచిపోతావా అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముగిసిన ఒకరోజు తరువాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ను ప్రకటించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించిన ఆటగాళ్లలోంచి కొందరిని ఎంపిక చేస్తూ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ అంటూ ప్రకటించింది. ఈ జట్టులో రోహిత్ శర్మకు స్థానం క్కలేదు.
భారత్ నుంచి ఏకంగా ఆరుగురు ఆటగాళ్లకు స్థానం దక్కింది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఇచ్చింది. 12వ ఆటగాడిగా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను ఎంపిక చేసింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్‌ను ఎంపిక చేసింది.
NZ vs PAK : ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో కోహ్లీని ఔట్ చేశాడు.. కెప్టెన్ అయ్యాడు..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్..
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, ఇబ్రహీం జాద్రాన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మాట్ హెన్రీ, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్.
Boys forget their bats.
Men forget their passports.Legends forget their trophies. #RohitSharma𓃵
pic.twitter.com/4XG6hEGkpx— desi sigma (@desisigma) March 10, 2025