NZ vs PAK : ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో కోహ్లీని ఔట్ చేశాడు.. కెప్టెన్ అయ్యాడు..
పాకిస్థాన్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌లకు న్యూజిలాండ్ జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు.

New Zealand announce T20I squad for 5 match series against Pakistan
స్వదేశంలో పాకిస్థాన్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్‌ను కెప్టెన్‌గా నియమించారు. ఇక ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో గాయపడిన పేసర్ మాట్ హెన్రీతో పాటు జాక్ ఫౌల్కేస్ లు చివరి రెండు టీ20లకు అందుబాటులో ఉంటారు.
కైల్ జేమిసన్, విల్ ఓ’రూర్కే లు తొలి మూడు టీ20లు మాత్రమే ఆడతారు. టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్, జేమ్స్ నీషమ్ లు తిరిగి జట్టులోకి వచ్చారు.
కెప్టెన్ మిచెల్ సాంట్నర్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెవాన్ జాకబ్స్ లు ఐపీఎల్‌లో ఆడనుండడంతో ఈ సిరీస్‌కు అందుబాటులో లేరని కివీస్ బోర్డు తెలిపింది. ఐపీఎల్ 18 వ సీజన్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిదే.
Champions Trophy : ప్రెజంటేషన్ సెర్మనీ పై పాకిస్థాన్ మాజీ బౌలర్ వసీం అక్రమ్ కీలక వ్యాఖ్యలు..
దేశానికి ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నట్లు బ్రేస్‌వెల్ ఓ ప్రకటనలో తెలిపాడు. గతేడాది పాక్ పర్యటనలో జట్టుకు నాయకత్వం వహించడం ఎంతో నచ్చింది. ఆ సిరీస్‌లో ఆడిన చాలా మంది ఆటగాళ్లు ప్రస్తుత సిరీస్‌కు ఎంపిక అయ్యారన్నాడు.
కాగా.. బ్రేస్‌వేల్ ఇటీవల ముగిసిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (1) ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.
పాక్, కివీస్ జట్ల మధ్య టీ20 సిరీస్ మార్చి 16న క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో ప్రారంభం కానుంది. చివరి టీ20 మ్యాచ్ మార్చి 26న వెల్లింగ్టన్‌లోని స్కై స్టేడియంలో జరుగుతుంది.
పాక్‌తో టీ20 సిరీస్ న్యూజిలాండ్ జట్టు ఇదే..
మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్‌మన్, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్ (నాలుగు, ఐదో టీ20లకు మాత్రమే), మిచ్ హే, మాట్ హెన్రీ (నాలుగు, ఐదో టీ20లకు మాత్రమే), కైల్ జామిసన్ (తొలి మూడు టీ20లకు మాత్రమే), డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, విల్ ఓ’రూర్కే (తొలి మూడు టీ20లకు మాత్రమే), టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి.
కివీస్‌తో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ టీ20 జట్టు ఇదే..
అఘా సల్మాన్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, హారిస్ రౌఫ్, హసన్ నవాజ్, జహందాద్ ఖాన్, ఖుష్దిల్ షా, మొహమ్మద్ అబ్బాస్ అఫ్రిది, మొహమ్మద్ అలీ, మొహమ్మద్ హారిస్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసఫ్, షాహీన్ షా అఫ్రిది, సుఫ్యాన్ మోకిమ్ మరియు ఉస్మాన్ ఖాన్.