Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆరంభంలో వరుస ఓటములతో ఇబ్బంది పడ్డ ముంబై ఇండియన్స్ ఆతరువాత బలంగా పుంజుకుంది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకువచ్చింది. ఇప్పటి వరకు ముంబై 10 మ్యాచ్‌లు ఆడగా 6 విజయాలు సాధించింది. 12 పాయిట్లు ఆ జట్టు ఖాతాలో ఉండగా నెట్‌రన్‌రేట్ +0.889 గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. కాగా.. నేడు (మే 1) జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో ముంబై తలపడనుంది.
ఈ కీలక మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు యువ స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూర్ గాయం కారణంగా ఈ సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
Get well soon, Vignesh 🥹
Your #OneFamily wishes you a speedy recovery & we can’t wait to see you back on the field soon 💙#MumbaiIndians #PlayLikeMumbai pic.twitter.com/Yej0ylKT6z
— Mumbai Indians (@mipaltan) May 1, 2025
అతడు ముంబై జట్టులో అంతర్భాగం అని, అతడు త్వరగా కోలుకుని బలంగా తిరిగిరావాలని రాసుకొచ్చింది. అతడి స్థానంలో లెగ్ స్పిన్నర్ రఘు శర్మను జట్టులోకి తీసుకున్నట్లుగా వెల్లడించింది.
CSK vs PBKS : పంజాబ్ కింగ్స్‌తో చెన్నై ఆటగాడి వివాదం..! సైగలు చేస్తూ.. వీడియో వైరల్..
ముంబై ఇండియన్స్ మెడికల్, స్ట్రెంగ్త్ & కండిషనింగ్ బృందం మార్గదర్శకత్వంలో విఘ్నేష్ కోలుకోవడం దృష్టిపెట్టాడని, అతడు ఫ్రాంచైజీతోనే ఉంటాడని జట్టు పేర్కొంది.
𝐑𝐚𝐠𝐡𝐮 𝐒𝐡𝐚𝐫𝐦𝐚 𝐫𝐞𝐩𝐥𝐚𝐜𝐞𝐬 𝐕𝐢𝐠𝐧𝐞𝐬𝐡 𝐏𝐮𝐭𝐡𝐮𝐫 𝐚𝐭 𝐌𝐮𝐦𝐛𝐚𝐢 𝐈𝐧𝐝𝐢𝐚𝐧𝐬 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐫𝐞𝐬𝐭 𝐨𝐟 #TATAIPL 𝟐𝟎𝟐𝟓 𝐬𝐞𝐚𝐬𝐨𝐧.
📰 Read more ➡ https://t.co/n9MJ7PvqlQ#MumbaiIndians #PlayLikeMumbai pic.twitter.com/a9Ia6XxLlZ
— Mumbai Indians (@mipaltan) May 1, 2025
ఇక రఘు శర్మ విషయానికి వస్తే.. అతడు దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్, పాండిచ్చేరి తరుపున ఆడాడు. 11 ఫస్ట్ కాస్ల్ మ్యాచ్‌ల్లో 19.59 సగటుతో 57 వికెట్లు తీశాడు. 9 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 14 వికెట్లు సాధించాడు. మూడు టీ20 మ్యాచ్‌ల్లో 3 వికెట్లు పడగొట్టాడు. 2024-25 విజయ్ హజారే ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేశాడు. 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టాడు.
రఘు శర్మను రూ.30లక్షల బేస్ ప్రైజ్‌తో ముంబై తీసుకుంది.