CSK vs PBKS : పంజాబ్ కింగ్స్‌తో చెన్నై ఆటగాడి వివాదం..! సైగలు చేస్తూ.. వీడియో వైరల్..
సీఎస్‌కే ఆటగాడు సామ్‌కరన్ తన పాత జట్టు పంజాబ్ కింగ్స్ పై అసహనం వ్యక్తం చేశాడు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా బుధవారం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ నుంచి అధికారికంగా నిష్ర్కమించింది. కాగా.. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఆటగాడు సామ్‌కరన్ తన పాత జట్టు పంజాబ్ కింగ్స్ పై అసహనం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో చెన్నై తొలుత బ్యాటింగ్ చేసింది. 48 పరుగులే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో సామ్ కరన్ ఆ జట్టును ఆదుకున్నాడు. 47 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 88 పరుగులు చేశాడు. బ్రెవిస్‌తో కలిసి 78 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ సీజన్‌లో అతడికి ఇదే తొలి అర్థశతకం. దీంతో చెన్నై 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. 191 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి అందుకుంది.
పంజాబ్ డగౌట్ వైపు చూస్తూ..
ఐపీఎల్ 2024 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు తరుపున ఆడాడు సామ్ కరన్. రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరం అయితే అతడి స్థానంలో నాయకత్వ బాధ్యతలను తీసుకున్నాడు. అయితే.. మెగావేలానికి ముందు పంజాబ్ అతడిని రిటైన్ చేసుకోలేదు. వేలానికి వదిలివేసింది. వేలంలో అతడిని సీఎస్‌కే దక్కించుకుంది.
He’s been busy at the crease today 💛
Sam Curran with a 5️⃣0️⃣ and going strong 💪
His first of the season 👏
Updates ▶ https://t.co/eXWTTv7Xhd #TATAIPL | #CSKvPBKS | @ChennaiIPL pic.twitter.com/tTDSBe3GoK
— IndianPremierLeague (@IPL) April 30, 2025
కాగా.. మ్యాచ్‌లో 18వ ఓవర్‌లో మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో జోస్ ఇంగ్లిష్ క్యాచ్ అందుకోవడంతో సామ్ కరన్ ఔట్ అయ్యాడు. అయితే.. అతడు పెవిలియన్‌కు వెలుతున్న క్రమంలో పంజాబ్ డగౌట్ వైపు సీరియస్‌గా చూస్తూ ఏవో సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో కరన్‌కు పంజాబ్ కింగ్స్‌కు మధ్య ఏదో వివాదం ఉన్నట్లుగా అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Sam Curran seems to having issue with Punjab management pic.twitter.com/8qNS3aA2XU
— MSDian (@NitinMudiyala) April 30, 2025
తనను రిటైన్ చేసుకోనందుకే కరన్ ఇలా చేసి ఉంటాడని కొందరు అంటున్నారు. మరి ఇలా ఎందుకు చేశాడు అన్న విషయం స్వయంగా అతడు చెబితేనే తెలుస్తుంది.