PBKS : చెన్నైపై విజయం సాధించిన జోష్‌లో ఉన్న పంజాబ్‌కు గట్టి ఎదురుదెబ్బ.. టోర్నమెంట్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. 4.2 కోట్లు బూడిదలో పోసిన పన్నీరే!
చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించి మంచి జోష్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది.

Courtesy BCCI
చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించి మంచి జోష్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఐపీఎల్‌లో మిగిలిన సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఈ సీజన్‌లో టైటిల్ సాధించాలని భావిస్తున్న పంజాబ్‌కు ఇది ఒకరకంగా ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.
గ్లెన్ మాక్స్‌వెల్ చేతివేలి గాయంతో బాధపడుతున్నట్లు పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెప్పాడు. చెన్నైతో మ్యాచ్ సందర్భంగా టాస్ వేసే సమయంలో అతడు ఈ విషయాన్ని వెల్లడించాడు.
MS Dhoni : రిటైర్‌మెంట్ పై ధోని ఆసక్తికర వ్యాఖ్యలు.. తరువాతి మ్యాచే..
🚨 MAXWELL RULED OUT OF IPL 2025 🚨 pic.twitter.com/82bIexIAlZ
— Johns. (@CricCrazyJohns) April 30, 2025
ప్రాక్టీస్ సెషన్‌లో మాక్స్‌వెల్ చేతికి ఫ్రాక్చర్ అయిందన్నాడు. నిజంగా తమకు ఇది గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాడు. అతడు ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. అతడి స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్న విషయం పై మేనేజ్‌మెంట్ సమాలోచనలు చేస్తోంది. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని శ్రేయస్ అన్నాడు.
వాస్తవానికి ఈ సీజన్‌లో మాక్స్‌వెల్ నిరాశపరుస్తున్నాడు. బౌలింగ్‌లో ఒకట్రెండు వికెట్లు తీసినప్పటికి బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలం అయ్యాడు. ఈ సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన అతడు 8 సగటు, 97.95 స్ట్రైక్‌రేటుతో 48 పరుగులు మాత్రమే చేశాడు. అతడి అత్యధిక స్కోరు 30 పరుగులు. ఈ క్రమంలో అతడిని జట్టు నుంచి తప్పించాలని పంజాబ్ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే సమయంలో మాక్సీ గాయంతో దూరం కావడం గమనార్హం.
ఐపీఎల్ మెగావేలంలో మాక్స్‌వెల్స్‌ను రూ.4.2 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకుంది.