MS Dhoni : రిటైర్‌మెంట్ పై ధోని ఆసక్తికర వ్యాఖ్యలు.. తరువాతి మ్యాచే..
చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని చేసిన కామెంట్స్ అతడి ఐపీఎల్ రిటైర్‌మెంట్ ఊహాగాలను మరింత పెంచింది.

PIC credit @ CSK
ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. పంజాబ్ కింగ్స్ పై ఓటమితో అధికారికంగా ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించింది. కాగా.. ఈ మ్యాచ్ టాస్ సమయంలో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని చేసిన కామెంట్స్ అతడి ఐపీఎల్ రిటైర్‌మెంట్ ఊహాగాలను మరింత పెంచింది.
బుధవారం చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ టాస్ సమయంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత డానీ మోరిసన్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఐపీఎల్‌కు వస్తారా అని ధోనిని అడిగాడు. ఇందుకు ధోని నవ్వుతూ.. తాను అసలు ఈ సీజన్‌లో తరువాతి మ్యాచ్ ఆడతానో లేదో తనకే తెలియదని అన్నాడు. మరోసారి మోరిసన్ మాట్లాడుతూ.. అభిమానులు స్పందన చూడడండి వారు తరువాతి సీజన్లలోనూ మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నారు అని అన్నాడు.
కాగా.. ఎంఎస్ ధోని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి 2020లో ధోని రిటైర్ అయ్యాడు. అప్పటి నుంచి కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన తరువాతి నుంచి ధోని ఐపీఎల్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకుంటాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రతి ఐపీఎల్ సీజన్ ధోనికి చివరిది అని ప్రచారం సాగుతోంది. కానీ 43 ఏళ్ల ధోని మాత్రం ఇప్పటికి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నాడు.
View this post on Instagram
ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన ఎంతో నిరాశపరిచింది. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడగా 8 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాదించింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. సీజన్ మధ్యలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో జట్టుకు దూరం కావడంతో సీఎస్‌కే పగ్గాలను ధోని అందుకున్నాడు. అయినప్పటికి కూడా చెన్నై ప్రదర్శన ఏమంత మెరుగుపడలేదు.