Matthew Hayden bold bet if Joe Root fails to score 100 in Ashes
Matthew Hayden : ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోరూట్ ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్నాడు. గతకొన్నాళ్లుగా అతడు టెస్టు క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ క్రమంలో సుధీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇటీవల భారత్‌తో ముగిసిన 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 9 ఇన్నింగ్స్‌ల్లో 67.12 సగటుతో 537 పరుగులు సాధించాడు.
ఏడాది నవంబర్‌లో యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను నవంబర్ 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు మరో రెండు నెలలకు పైగా సమయం ఉన్నప్పటికి కూడా ఇప్పటి నుంచే ఇరు దేశాల మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు ఈ సిరీస్ గురించి చర్చించుకుంటున్నారు.
Bronco Test : బ్రాంకో టెస్టును పూర్తి చేసిన టీమ్ఇండియా ఆటగాళ్లు.. వీడియో రిలీజ్ చేసిన బీసీసీఐ
కాగా.. ఈ యాషెస్ సిరీస్‌లో ఓ ఇన్నింగ్స్‌ల్లో జోరూట్ ఖచ్చితంగా సెంచరీ చేస్తాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు మాథ్యూ హేడెన్ (Matthew Hayden)తెలిపాడు. ఒకవేళ రూట్ సెంచరీ చేయలేకపోతే తాను ఎంసీజీ మైదానం చుట్టూ నగ్నంగా తిరుతానని అన్నాడు.
వాస్తవానికి ఇప్పటి వరకు రూట్ ఆస్ట్రేలియా టెస్టు సెంచరీ చేయలేదు. ఇప్పటి వరకు ఆసీస్‌లో రూట్ 14 టెస్టులు ఆడాడు 35.68 సగటుతో 892 పరుగులు చేశాడు. ఇందులో 9 హాఫ్ సెంచరీలు ఉండగా ఒక్క సెంచరీని కూడా నమోదు చేయలేదు. అయినప్పటికి ప్రస్తుతం అతడు ఉన్న ఫామ్ దృష్ట్యా ఈ సారి ఆసీస్‌లో సెంచరీ కరువును తీర్చుకుంటామని ఆసీస్ ఆటగాడు హేడెన్ ఓ యూట్యూబ్ ఛానెల్‌లో జరిగిన చర్చ సందర్భంగా చెప్పాడు.
హేడెన్ మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై హెడెన్ కూతురు, క్రికెట్ ప్రెజెంటర్ కూడా అయిన గ్రేస్ హేడెన్ స్పందించింది. యాషెస్ సిరీస్‌లో రూట్ సెంచరీ సాధించాలని కోరింది. రూట్ మీరు సెంచరీ చేయండి అని కామెంట్స్‌లో గ్రేస్ రాసుకొచ్చింది.
అందని ద్రాక్షగానే..
ఆస్ట్రేలియాలో రూట్ ఏ ఫార్మాట్‌లోనూ సెంచరీ చేయలేదు. 14 టెస్టులతో పాటు 16 వన్డేలు, మూడు టీ20లు అక్కడ ఆడాడు. అయినప్పటికి కూడా అతడికి అక్కడ సెంచరీ అనేది అందని ద్రాక్షగానే ఉంది.
ఇదిలా ఉంటే.. రూట్ తన కెరీర్‌లో ఆస్ట్రేలియాపై నాలుగు సెంచరీలు చేశాడు. అవన్నీ కూడా స్వదేశంలో (ఇంగ్లాండ్‌లో)నే చేసినవి కావడం గమనార్హం. 34 ఏళ్ల రూట్ ఇప్పటి వరకు ఆసీస్ పై 34 టెస్టులు ఆడి 40.46 సగటుతో 2428 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలు, 18 అర్థశతకాలు ఉన్నాయి.