NED vs RSA : ఓడిపోయే మ్యాచ్‌లో గ‌ట్టెక్కిన సౌతాఫ్రికా.. కొద్దిలో పెను సంచ‌ల‌నం మిస్సైందిగా..!

తృటిలో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు ఘోర ప‌రాభ‌వాన్ని త‌ప్పించుకుంది.

Miller steers South Africa to victory despite scare from Netherlands

Netherlands vs South Africa : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో పెను సంచ‌ల‌నాలు న‌మోదు అవుతున్నాయి. అయితే.. తృటిలో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు ఘోర ప‌రాభ‌వాన్ని త‌ప్పించుకుంది. ఉత్కంఠ‌గా సాగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో డేవిడ్ మిల్ల‌ర్ హాఫ్ సెంచ‌రీతో రాణించ‌డంతో సౌతాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.

న్యూయార్క్‌లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శ‌నివారం రాత్రి ద‌క్షిణాఫ్రికా, నెద‌ర్లాండ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో నెద‌ర్లాండ్స్ మొద‌ట‌ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్ల న‌ష్టానికి 103 ప‌రుగులు చేసింది. నెదర్లాండ్స్ బ్యాటర్లలో సైబ్రాండ్(40; 45 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్‌), లోగన్ వాన్ బీక్( 23; 22 బంతుల్లో 3 ఫోర్లు) లు రాణించారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో ఓట్‌నెలి బార్ట్‌మన్ నాలుగు వికెట్లు తీశాడు. అన్రిచ్ నోకియా, మార్కో జాన్సెన్ లు చెరో రెండు వికెట్ల ప‌డ‌గొట్టారు.

IND vs PAK : భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌.. క‌ల‌వ‌ర‌పెడుతున్న పిచ్‌.. సై అంటున్న‌ వ‌రుణుడు.. విజ‌యం ఎవ‌రిదో ?

అనంత‌రం స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ద‌క్షిణాఫ్రికా 18.5 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స‌ఫారీ బ్యాట‌ర్ల‌లో డేవిడ్ మిల్ల‌ర్ (59నాటౌట్‌; 51 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేయ‌గా.. ట్రిస్టన్ స్టబ్స్ (33; 37 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌) రాణించాడు. నెద‌ర్లాండ్స్ బౌల‌ర్ల‌లో వివియ‌న్, లోగాన్ వాన్ బీక్ చెరో రెండు వికెట్లు తీశాడు. బాస్ డీ లీడే ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

ఆదుకున్న మిల్ల‌ర్‌..

స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన ద‌క్షిణాఫ్రికాకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఓపెన‌ర్లు రీజా హెండ్రిక్స్ (3) క్వింట‌న్ డికాక్ (0) ల‌తో పాటు కెప్టెన్ ఎయిడెన్ మార్‌క్ర‌మ్ (0), హెన్రిచ్ క్లాసెన్ (4) లు త‌క్కువ ప‌రుగుల‌కే ఔట్ కావ‌డంతో 12 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయిన ద‌క్షిణాఫ్రికా తీవ్ర క‌ష్టాల్లో ప‌డింది. ఈ దశ‌లో మ‌రో సంచ‌ల‌నం న‌మోదు అవుతుంద‌ని చాలా మంది అనుకున్నారు.

WI vs UGA : 39 ప‌రుగుల‌కే ఉగాండా ఆలౌట్‌.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో చ‌రిత్ర‌లో వెస్టిండీస్‌కు అతి పెద్ద విజ‌యం..

అయితే.. సీనియ‌ర్ ఆట‌గాడు డేవిడ్ మిల్ల‌ర్‌, యువ ఆట‌గాడు ట్రిస్ట‌న్ స్ట‌బ్స్‌తో జ‌త క‌లిసి ఇన్నింగ్స్ ను నిర్మించే బాధ్య‌త‌ను భుజాన వేసుకున్నాడు. వీరిద్ద‌రు ఆచితూచి ఆడాడు. వీలు చిక్కిన‌ప్పుడు బంతిని బౌండ‌రీకి త‌ర‌లించారు. ఐదో వికెట్‌కు 65 ప‌రుగులు జోడించారు. ట్రిస్ట‌న్ స్ట‌బ్స్‌, మార్కో జాన్సెన్ (3) లు స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ఔటైనా కేశవ్ మ‌హ‌రాజ్ (0)తో క‌లిసి మిల్ల‌ర్ ద‌క్షిణాఫ్రికాకు విజ‌యాన్ని అందించాడు.

ట్రెండింగ్ వార్తలు