Mis Kiran More Tests Positive For Covid 19
MI’s Kiran More: భారతజట్టు మాజీ క్రికెటర్.. ముంబై ఇండియన్స్ జట్టు అడ్వైజర్ కిరణ్ మోరె కరోనా వైరస్ బారిన పడ్డారు. లేటెస్ట్‌గా జరిగిన పరీక్షల్లో కిరణ్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా ఫ్రాంచైజీ ప్రకటించింది. అయితే అతనికి ఎటువంటి లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ వచ్చిందని, నిబంధనల ప్రకారం ఐసోలేషన్‌కు తరలించినట్లు స్పష్టం చేశారు.
బీసీసీఐ నిబంధనలు ప్రకారం.. కరోనా టెస్ట్ చేయించుకుని, జట్టు సభ్యులతో చేరవలసి ఉండగా.. ఈ సమయంలో మోరెకి కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా తేలింది. దీనిపై ప్రకటన చేసిన ముంబై ఇండియన్స్.. తమ వైద్య బృందం మోరె ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందని తెలిపింది. దేశవ్యాప్తంగా కొవిడ్-19 విజృంభిస్తుండటంతో అభిమానులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
మోరె ముంబయి ఇండియన్స్‌కు వికెట్ కీపింగ్‌లో మెలకువలు నేర్పించడంలో ముఖ్యంగా మోరే సాయం చేస్తున్నారు. సలహాలు ఇస్తున్నారు. ఇప్పటికే ఐపీఎల్ 2021కి కరోనా ముప్పు ఉండగా.. ఇప్పుడు జట్టు సభ్యలకు కూడా కరోనా వస్తుండడంతో ఐపీఎల్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.