Mitchell Johnson : ఆస్ట్రేలియా ప‌రువు తీసిన డేవిడ్ వార్న‌ర్‌.. ఘ‌న వీడ్కోలుకు అర్హుడు కాదు.. మాజీ పేస‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Mitchell Johnson-David Warner : ఆస్ట్రేలియా విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ స్వ‌దేశంలో జ‌ర‌గ‌నున్న పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ అనంత‌రం సుదీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌నున్నాడు.

David Warner-Mitchell Johnson

ఆస్ట్రేలియా విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ స్వ‌దేశంలో జ‌ర‌గ‌నున్న పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ అనంత‌రం సుదీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌నున్నాడు. ఈ విష‌యాన్ని వార్న‌ర్ ఎప్పుడో చెప్పాడు. అయితే.. ఆస్ట్రేలియా ప‌రువు తీసిన వార్న‌ర్ ఘ‌న వీడ్కోలుకు అర్హుడు కాదంటూ ఆ జ‌ట్టు మాజీ పేస‌ర్ మిచెల్ జాన్స‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. పెర్త్ వేదిక‌గా పాక్‌తో జ‌ర‌గ‌నున్న మొద‌టి టెస్టు కోసం క్రికెట్ ఆస్ట్రేలియా 14 మందితో కూడిన ఆసీస్ జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఇందులో వార్న‌ర్‌కు చోటు ఇచ్చింది. ఈ నేప‌థ్యంలోనే జాన్స‌న్‌ను వ్యాఖ్య‌లు చేశాడు.

2018లో ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో బాల్ టాంప‌రింగ్ వివాదంలో డేవిడ్ వార్న‌ర్ చిక్కుకున్నాడు. ఈ క్ర‌మంలో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) అత‌డిపై ఏడాది పాటు నిషేదం విధించింది. అంతేకాకుండా భ‌విష్య‌త్తులో ఆస్ట్రేలియా కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్టే అవ‌కాశం లేకుండా చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్నే జాన్స‌న్ మ‌రోసారి ప్ర‌స్తావించాడు. వార్న‌ర్‌కు వీడ్కోలు ప‌లికేందుకు ఆస్ట్రేలియా సిద్ధం అవుతోంద‌న్నాడు.

Team India vice captain : ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు ముందు పారిస్‌లో టీమ్ఇండియా వైస్ కెప్టెన్.. ఏం చేస్తున్నాడో తెలుసా..?

టెస్టుల్లో దారుణంగా విప‌లం అవుతున్న వార్న‌ర్ కు రిటైర్‌మెంట్ డేట్‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఎందుకు ఇచ్చారంటూ మండిప‌డ్డాడు. ఆస్ట్రేలియా క్రికెట్ చ‌రిత్ర‌లో అతిపెద్ద కుంభ‌కోణంలో నిలిచిన ఓ ఆట‌గాడికి హీరోగా వీడ్కోలు ప‌ల‌కొద్ద‌న్నాడు.

మొద‌టి టెస్టుకు ఆస్ట్రేలియా జ‌ట్టు ఇదే : పాట్ కమిన్స్ (కెప్టెన్‌), స్కాట్ బొలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్‌, నాథన్ లియాన్, మిచ్ మార్ష్, లాన్స్ మోరిస్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్

Bangladesh Players : అదృష్టం అంటే బంగ్లాదేశ్ ప్లేయ‌ర్ల‌దే.. ఒక్క మ్యాచులో గెల‌వ‌గానే.. బోన‌స్‌, డిన్న‌ర్ ఇంకా..

ట్రెండింగ్ వార్తలు