Bangladesh Players : అదృష్టం అంటే బంగ్లాదేశ్ ప్లేయ‌ర్ల‌దే.. ఒక్క మ్యాచులో గెల‌వ‌గానే.. బోన‌స్‌, డిన్న‌ర్ ఇంకా..

Bangladesh vs New Zealand : న్యూజిలాండ్‌తో జ‌రిగిన మొద‌టి టెస్టులో బంగ్లాదేశ్ ఘ‌న విజ‌యం సాధించింది.

Bangladesh Players : అదృష్టం అంటే బంగ్లాదేశ్ ప్లేయ‌ర్ల‌దే.. ఒక్క మ్యాచులో గెల‌వ‌గానే.. బోన‌స్‌, డిన్న‌ర్ ఇంకా..

Bangladesh Players

న్యూజిలాండ్‌తో జ‌రిగిన మొద‌టి టెస్టులో బంగ్లాదేశ్ ఘ‌న విజ‌యం సాధించింది. స్వ‌దేశంలో కివీస్ పై బంగ్లాదేశ్‌కు ఇదే మొద‌టి గెలుపు. 150 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించ‌డంతో బంగ్లాదేశ్ ఆట‌గాళ్ల గెలుపు సంబ‌రాలు అంబ‌రాన్ని అంటాయి. అంతేనా ఆ దేశ వ్యాప్తంగా బంగ్లా ప్లేయ‌ర్ల‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. కొత్త కెప్టెన్ న‌జ్మ‌ల్ హొస్సేన్ శాంటో నాయ‌క‌త్వంలో బంగ్లాదేశ్ ఈ చారిత్రాత్మ‌క విజ‌యాన్ని అందుకుంది.

ఈ క్ర‌మంలో ప్లేయ‌ర్ల‌కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) బంఫ‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించ‌నుంది. ఈ విష‌యాన్ని బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ ఛైర్మన్ జలాల్ యూనస్ చెప్పారు. ఆట‌గాళ్ల‌కు మ‌ద్ద‌తుగా బోర్డు ఎప్పుడూ ఉంటుంది. ఈ విజ‌యం మాట‌ల్లో వ‌ర్ణించ‌లేనిది. ఆట‌గాళ్ల‌కు బోన‌స్ ఇవ్వాల‌ని బీసీబీ అధ్య‌క్షుడిని కోరారు. అది ఖ‌చ్చితంగా జ‌రుగుతుంది.

Bizarre No Ball : విచిత్రమైన నో బాల్‌.. మ్యాచ్ ఫిక్సింగ్ చేశావా ఏంటి..? ఇలా ఎప్పుడు చూడ‌లేదే..?

బంగ్లా ఆట‌గాళ్లు ఢాకాకు చేరుకున్న త‌రువాత వారితో క‌లిసి బీసీబీ అధ్య‌క్షుడు డిన్న‌ర్ చేయ‌నున్నారు. ఆ త‌రువాత బోన‌స్‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న ఉంటుంది అని విలేక‌రుల స‌మావేశంలో జలాల్ యూనస్ తెలిపారు.

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. బంగ్లాదేశ్‌ మొద‌టి ఇన్నింగ్స్‌లో 310 పరుగులకు ఆలౌటైంది. అనంత‌రం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులు చేసింది. కివీస్‌కు ఏడు ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యం ల‌భించింది. అనంత‌రం రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 338 ప‌రుగులు చేసింది. దీంతో కివీస్ ముందు 332 ప‌రుగుల ల‌క్ష్యం నిల‌వ‌గా ఆ జ‌ట్టు 181 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. బంగ్లాదేశ్‌ వెటరన్‌ స్పిన్నర్‌, తైజుల్‌ ఇస్లాం ఆరు వికెట్లతో న్యూజిలాండ్ ప‌త‌నాన్ని శాసించాడు.

Team India : ప్రపంచకప్ ఫైనల్ ఓటమిపై రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మలను ప్ర‌శ్నించిన‌ బీసీసీఐ..!

ఇక ఇరు జ‌ట్ల మ‌ధ్య డిసెంబర్‌ 26 నుంచి ఢాకా వేదికగా రెండో టెస్టు ఆరంభం కానుంది.