Azharuddin On tickets Issue
Azharuddin on tickets issue: ఉప్పల్ స్టేడియంలో ఆదివారం భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో చేసిన ఏర్పాట్లు, టికెట్ల అమ్మకాల్లో గందరగోళం వంటి అంశాలపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివరణ ఇచ్చింది. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అజారుద్దీన్ మాట్లాడుతూ… పేటీఎంద్వారా టికెట్లు విక్రయించామని వివరించారు. టికెట్ల అమ్మకాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎలాంటి పొరపాట్లు జరగలేదని చెప్పుకొచ్చారు.
టికెట్ల అమ్మకాల్లో అసలు ఎలాంటి గందరగోళమూ లేదని అజారుద్దీన్ అన్నారు. కొందరు కావాలనే తమపై దుష్ప్రచారం చేశారని చెప్పారు. టికెట్ల అమ్మకాల్లో తమ తప్పు ఏమీ లేదని అజారుద్దీన్ అన్నారు. బ్లాక్ లో టికెట్లు అమ్మేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారన్న వదంతులు ఎలా వచ్చాయో తెలియదని చెప్పుకొచ్చారు.
చాలా ఏళ్ల తర్వాత హైదరాబాదులో అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించే అవకాశం వచ్చిందని, ప్రతి ఒక్కరూ మ్యాచ్ నిర్వహణను విజయవంతం చేయాలని కోరుతున్నామని అజారుద్దీన్ అన్నారు. మ్యాచ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని, ఆసీస్ తో మ్యాచ్ ఆసక్తికరంగా జరుగుతుందని భావిస్తున్నామని అన్నారు.
Amit shah slams nitish kumar: ఇలాగైతే నితీశ్ బాబు దేశ ప్రధాని ఎలా కాగలరు?: అమిత్ షా