Mohammad Rizwan : టీ20ల్లో రిజ్వాన్ అరుదైన రికార్డు.. సిక్స‌ర్ల మోత‌..

పాకిస్తాన్ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ రిజ్వాన్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Mohammad Rizwan : పాకిస్తాన్ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ రిజ్వాన్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. పాకిస్తాన్ త‌రుపున టీ20ల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. హామిల్టన్ వేదిక‌గా ఆదివారం న్యూజిలాండ్‌తో జ‌రిగిన రెండో టీ20 మ్యాచులో అత‌డు ఈ ఘ‌న‌త సాధించాడు. ఈ మ్యాచులో తాను ఆడిన మొద‌టి బంతికే సిక్స్ కొట్టి ఈ రికార్డును రిజ్వాన్ అందుకున్నాడు. ఈ క్ర‌మంలో మాజీ కెప్టెన్ మ‌హ్మ‌ద్ హ‌ఫీజ్ రికార్డును అధిగ‌మించాడు. హ‌ఫీజ్ త‌న కెరీర్‌లో 76 సిక్సులు కొట్ట‌గా 77 సిక్సుల‌తో రిజ్వాన్ మొద‌టి స్థానానికి చేరుకున్నాడు. కాగా.. ఈ మ్యాచులో రిజ్వాన్ ఏడు ప‌రుగుల‌కే ఔట్ అయ్యాడు.

పాక్ త‌రుపున టీ20ల్లో అత్య‌ధిక సిక్సులు కొట్టిన ఆట‌గాళ్లు..

మహ్మద్ రిజ్వాన్ – 77 సిక్స‌ర్లు
మహ్మద్ హఫీజ్ – 76
షాహిద్ అఫ్రిది – 73
షోయబ్ మాలిక్ – 69
ఉమర్ అక్మల్ – 55

Virat Kohli : రీ ఎంట్రీ మ్యాచులో మూడు రికార్డుల పై కోహ్లీ క‌న్ను.. ఎన్ని అందుకుంటాడో మ‌రీ..!

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 194 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ ఫిన్ అలెన్ (74; 41 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ బాదాడు. విలియ‌మ్‌స‌న్ (26), మిచెల్ సాంట్నర్ (25), డేవాన్ కాన్వే (20) లు రాణించారు. పాకిస్తాన్ బౌల‌ర్ల‌లో హరీస్ రవూఫ్ మూడు వికెట్లు తీశాడు. అబ్బాస్ అప్రిది రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అమీర్ జ‌మాల్‌, ఉసామా మీర్ చెరో వికెట్ సాధించాడు.

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో పాకిస్తాన్ 19.3 ఓవ‌ర్ల‌లో 173 ప‌రుగుల‌కు ఆలౌటైంది. బాబార్ ఆజాం (66; 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), ఫ‌ఖ‌ర్ జ‌మాన్ (50; 25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీలు చేశారు. కెప్టెన్ షాహీన్ అఫ్రిది (22; 13 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స‌ర్లు) రాణించిన‌ప్ప‌టికి మిగిలిన వారు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావ‌డంతో 21 ప‌రుగుల తేడాతో పాకిస్తాన్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు. కివీస్ బౌల‌ర్ల‌లో ఆడ‌మ్ మిల్నే నాలుగు వికెట్లు తీశాడు. టిమ్ సౌథీ, బెన్ సియర్స్, ఇష్ సోధిలు త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ‌కు అవ‌మానం..! ముంబై ఇండియ‌న్స్ పై మండిప‌డుతున్న ఫ్యాన్స్‌..

ఈ విజ‌యంతో కివీస్ ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.

ట్రెండింగ్ వార్తలు