IND vs NZ : న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌.. రోహిత్ శ‌ర్మను ఊరిస్తున్న భారీ రికార్డు..

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అరుదైన రికార్డుపై క‌న్నేశాడు.

Most sixes for India in Test cricket 3 sixs away Rohit Sharma

IND vs NZ 1st Test : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అరుదైన రికార్డుపై క‌న్నేశాడు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో హిట్‌మ్యాన్ మూడు సిక్స‌ర్లు బాదితే భార‌త్ త‌రుపున టెస్టుల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించ‌నున్నాడు. ప్ర‌స్తుతం ఈ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిటి ఉంది. టెస్టుల్లో సెహ్వాగ్ 90 సిక్స‌ర్లు బాదాడు. రోహిత్ శ‌ర్మ ఇప్ప‌టి వ‌ర‌కు 87 సిక్స‌ర్లు కొట్టాడు.

ఒక‌వేళ 13 సిక్స‌ర్లు గ‌నుక రోహిత్ శ‌ర్మ కొడితే.. టెస్టుల్లో వంద సిక్స‌ర్లు బాదిన తొలి భార‌త ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్క‌నున్నాడు. ఇక ఓవ‌రాల్‌గా టెస్టుల్లో వంద సిక్స‌ర్లు కొట్టిన నాలుగో ఆట‌గాడిగా నిల‌వ‌నున్నాడు. బెన్‌స్టోక్స్‌, బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్‌, ఆడ‌మ్ గిల్‌క్రిస్ట్‌లు సుదీర్ఘ ఫార్మాట్‌లో వంద‌కు పైగా సిక్స‌ర్లు కొట్టారు.

Kamran Ghulam : పాకిస్థాన్ న‌యా బ్యాటింగ్ సంచ‌ల‌నం క‌మ్రాన్ గులామ్‌ను చెంప దెబ్బ కొట్టిన బౌల‌ర్ హ‌రీస్ ర‌వూఫ్‌.. పాత వీడియో వైర‌ల్‌

టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆట‌గాళ్లు..

* వీరేంద్ర సెహ్వాగ్ – 103 టెస్టుల్లో 90 సిక్స‌ర్లు
* రోహిత్ శర్మ- 61 టెస్టుల్లో 87 సిక్స‌ర్లు
* ఎంఎస్ ధోని – 90 టెస్టుల్లో 78 సిక్స‌ర్లు
* సచిన్ టెండూల్కర్ – 200 టెస్టుల్లో 69 సిక్స‌ర్లు
* రవీంద్ర జడేజా – 74 టెస్టుల్లో 66 సిక్స‌ర్లు

ఊరిస్తున్న కోహ్లీ రికార్డు..
ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ)లో భార‌త జ‌ట్టుకు రోహిత్ శ‌ర్మ కెప్టెన్‌గా 12 విజ‌యాల‌ను అందించాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 14 విజ‌యాల‌తో అగ్ర‌స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను భార‌త్ క్లీన్‌స్వీప్ చేస్తే కోహ్లీ రికార్డును రోహిత్ శ‌ర్మ అధిగ‌మిస్తాడు.

PAK vs ENG : శ‌త‌కంతో చెల‌రేగిన క‌మ్రాన్ గులామ్‌.. బాబ‌ర్ ఆజం ఏమ‌న్నాడంటే..?