MRF క్రికెట్ ర్యాంకింగ్స్: పాయింట్లు పెరిగినా.. సెకండ్ ప్లేస్‌లోనే భారత్

ఐసీసీ ప్రకటించిన ర్యాంకులతో పాటు ఎమ్మారెఫ్ ప్రకటించిన ర్యాంకులను ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది క్రికెట్ ప్రపంచమంతా. ఇటీవలే ఐసీసీ ప్రకటించిన ర్యాంకులతో పాటు ఎమ్మారెఫ్ టైర్స్ ఐసీసీ ర్యాంకులను ప్రకటించి క్రికెట్ అభిమానులకు మరో వినోదాన్ని అందించింది. 

ఎమ్మారెఫ్ టైర్స్ ఐసీసీ వన్డే జట్టు ర్యాంకింగ్స్:

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ ఒక పాయింట్ సాధించినప్పటికీ రెండో స్థానంలోనే కొనసాగుతోంది. నెంబర్ 1 స్థానంలో ఇంగ్లాండ్ 126 పాయింట్లతో కొనసాగుతుంది. భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 1-4తేడాతో న్యూజిలాండ్ ఓడిపోవడంతో ఒక పాయింట్ దిగజారి దక్షిణాఫ్రికా కంటే కింద నాలుగో స్థానానికి చేరింది. యూఏఈతో తలపడి మొదిటి వన్డే సిరీస్ విజయం దక్కించుకున్న నేపాల్ 10 పాయింట్లు సంపాదించుకోగా యూఏఈ మాత్రం ఆరు పాయింట్లు కోల్పోయి 15 పాయింట్లతో సరిపెట్టుకుంది. 

ఎమ్మారెఫ్ టైర్స్ ఐసీసీ వన్డే పురుషుల ర్యాంకింగ్స్:

ఎందులోనైనా టాప్‌లోనే అన్నట్లు కోహ్లీ ఈ ర్యాంకింగ్స్ లోనూ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. 887 పాయింట్లతో 59.50 యావరేజ్‌తో మొదటి స్థానంలో ఉండగా రోహిత్ శర్మ 854 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. బౌలర్ల జాబితాలో జస్ప్రిత్ బుమ్రా 808 పాయింట్లతో అగ్రస్థానానికి చేరాడు. ఆ తర్వాతి స్థానంలో అఫ్ఘాన్ ప్లేయర్ రషీద్ ఖాన్ 788 పాయింట్లతో కొనసాగుతున్నాడు.  ఆల్ రౌండర్ విభాగంలోనూ రషీద్ ఖాన్ మొదటి స్థానం దక్కించుకోవడం విశేషం.