ధోనీ పుట్టినరోజు వేడుకల్లో భార్య సాక్షి ఏం చేసిందో చూశారా.. వీడియో వైరల్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మహేంద్ర సింగ్ ధోనీ, అతని సతీమణి సాక్షి ఉన్నారు. ధోనీ కేక్ కట్ చేయగా..

MS Dhoni Birthday Celebrations

MS Dhoni Birthday Celebrations : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 43వ పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ కటౌట్లు ఏర్పాటు చేయడంతోపాటు.. కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ పుట్టినరోజును కుటుంబ సభ్యులు, స్నేహితులు ఘనంగా నిర్వహించారు. బర్త్ డే బాయ్ ధోనీతో కేక్ కట్ చేయించారు.

Also Read : ప్రజాభవన్‌లో ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ.. ఫొటోలు వైరల్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మహేంద్ర సింగ్ ధోనీ, అతని సతీమణి సాక్షి ఉన్నారు. ధోనీ కేక్ కట్ చేయగా.. ఒకరినొకరు కేక్ తినిపించుకున్నారు. ఆ తరువాత మహేంద్ర సింగ్ ధోనీ పాదాలకు నమస్కారం చేసి సాక్షి ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో అక్కడ ఉన్నవారంతా చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు. దీంతో ధోనీ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ధోనీ, సాక్షి మధ్య అనుబంధాన్ని కొనియాడుతూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Also Read : ‘బహిష్కరణ’ టీజర్ చూశారా? బాబోయ్ అంజలి పర్ఫార్మెన్స్ మాములుగా లేదుగా..

ఇటీవల మహేంద్ర సింగ్ ధోనీ, సాక్షి 15వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఆ సమయంలో వారిద్దరు కలిసిఉన్న పాత ఫొటోలతో కూడిన ఫ్రేమ్ ను సాక్షి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఫోస్ట్ చేసింది. ఈ పోస్టుకు ‘మా 15వ సంవత్సరం ప్రారంభం’ క్యాప్షన్ ఇచ్చింది.