MS Dhoni : ప్ర‌పంచ‌కప్ లో టీమిండియా విజ‌యావ‌కాశాల‌పై ధోనీ కామెంట్స్ వైర‌ల్‌

స్వదేశంలో జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌కప్ 2023లో టీమ్ఇండియా దూసుకుపోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన ఐదు మ్యాచుల్లోనూ విజ‌యాలు సాధించి ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో నిలిచింది.

MS Dhoni comments

MS Dhoni comments : స్వదేశంలో జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌కప్ 2023లో టీమ్ఇండియా దూసుకుపోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన ఐదు మ్యాచుల్లోనూ విజ‌యాలు సాధించి ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో నిలిచింది. ఆదివారం డిఫెండింగ్ ఛాంపియ‌న్ ఇంగ్లాండ్‌తో టీమ్ఇండియా త‌ల‌ప‌డ‌నుంది. వ్యక్తిగ‌తంగానే కాకుండా జ‌ట్టును స‌మ‌ర్థ‌వంతంగా రోహిత్ శ‌ర్మ ముందుకు తీసుకువెలుతున్నాడు. ఈ నేప‌థ్యంలో ఈ సారి ఖ‌చ్చితంగా భార‌త జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్ సాధిస్తుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో టీమ్ఇండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన మ‌హేంద్ర సింగ్ ధోని భార‌త జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్ గెలిచే అవ‌కాశాల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌కప్ ఆడుతున్న జ‌ట్టు చాలా బాగుంద‌ని ధోనీ చెప్పాడు. స‌మ‌తూకంగా క‌నిపిస్తోంద‌న్నాడు. అన్ని విభాగాలు చాలా ప‌టిష్టంగా ఉన్నాయని, విజ‌యాలు సాధిస్తుంద‌న్నాడు. అన్నీ మంచి శ‌కున‌ములే క‌నిపిస్తున్నాయని, ఇంత కంటే ప్ర‌స్తుతం తాను ఎక్కువ ఏమీ చెప్ప‌లేన‌ని అన్నాడు. అర్థం చేసుకునేవాళ్ల‌కు ఒక్క సైగ చాలు అన్నాడు. 2019లో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త జ‌ట్టు కొద్దిలో సెమీస్‌లో ఓడిపోవ‌డం త‌న‌ను ఇంకా బాధిస్తోంద‌ని చెప్పాడు. భావోద్వేగాల‌ను నియంత్రించుకోవ‌డ‌మే చాలా క‌ష్ట‌మ‌ని తెలిపాడు. అదే నా చివ‌రి మ్యాచ్ అయ్యింది. 15 ఏళ్ల‌కు పైగా దేశానికి ప్రాతినిధ్యం వ‌హించి వీడ్కోలు చెప్ప‌డం ఎంతో బాధ‌గా ఉంటుంద‌ని, అయితే.. ప్ర‌తీ క్రికెట‌ర్‌కు త‌ప్ప‌కుండా ఎప్పుడో ఒక అప్పుడు అలాంటి రోజు వ‌స్తుంద‌ని ధోనీ అన్నాడు.

Also Read : మాది చెత్త టీమ్‌ కాదు.. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు : బ‌ట్ల‌ర్‌

ఐపీఎల్ ఆడ‌డం పై ధోనీ ఏమ‌న్నాడంటే..?

ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ఐదు సార్లు టైటిల్ అందించాడు ఎంఎస్ ధోని. ఐపీఎల్ 2023 సీజ‌న్ ముగిసిన త‌రువాత త‌న మోకాలికి స‌ర్జ‌రీ చేయించుకున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డు వ‌చ్చే ఐపీఎల్ ఆడ‌డం క‌ష్ట‌మేన‌ని ప‌లువురు క్రీడాపండితులు అంచ‌నా వేస్తున్నారు. దీని పై ధోనీ స్పందించాడు. స‌ర్జ‌రీ త‌రువాత వేగంగా కోలుకుంటున్న‌ట్లు చెప్పాడు. ఎలాంటి ఇబ్బంది లేద‌న్నాడు. వ‌చ్చే నెల వ‌ర‌కు మ‌రింత మెరుగు అవుతాన‌నే న‌మ్మ‌కం ఉందన్నాడు. తాను వ‌చ్చే సీజ‌న్‌లో ఐపీఎల్ ఆడుతాన‌ని ప‌రోక్షంగా చెప్పాడు. ఇక తాను ఒక‌టే కోరుకుంటాన‌ని, ఓ అద్భుత‌మైన క్రికెట‌ర్‌గా కాకుండా ఓ మంచి వ్య‌క్తిగా ప్ర‌తి ఒక్క‌రు త‌న‌ను గుర్తు పెట్టుకోవాల‌ని అనుకుంటాన‌ని మ‌హేంద్రుడు అన్నాడు.

Also Read : భార‌త్‌, శ్రీలంక మ్యాచ్‌కు ముందే స‌చిన్ విగ్ర‌హావిష్క‌ర‌ణ.. ఎందుకో తెలుసా..?

ట్రెండింగ్ వార్తలు