ENG vs SL : మాది చెత్త టీమ్‌ కాదు.. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు : బ‌ట్ల‌ర్‌

భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంగ్లాండ్ దారుణ ఆటతీరు క‌న‌బ‌రుస్తోంది. డిఫెండింగ్ చాంపియ‌న్ హోదాలో ఈ మెగాటోర్నీలో బ‌రిలోకి దిగి.. పేల‌వ ఆట‌తీరుతో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటుంది.

ENG vs SL : మాది చెత్త టీమ్‌ కాదు.. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు : బ‌ట్ల‌ర్‌

Jos Buttler

England vs Sri lanka : భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంగ్లాండ్ దారుణ ఆటతీరు క‌న‌బ‌రుస్తోంది. డిఫెండింగ్ చాంపియ‌న్ హోదాలో ఈ మెగాటోర్నీలో బ‌రిలోకి దిగి.. పేల‌వ ఆట‌తీరుతో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటుంది. ఈ టోర్నీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఇంగ్లాండ్ ఐదు మ్యాచులు ఆడ‌గా ఒకే మ్యాచులో విజ‌యం సాధించింది. మిగిలిన నాలుగు మ్యాచుల్లో ఓడిపోవ‌డంతో సెమీస్ అవ‌కాశాలు దాదాపుగా మూసుకుపోయిన‌ట్లే. గురువారం బెంగళూరు వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచులో 8 వికెట్ల తేడాతో ఓడి పోయిన త‌రువాత ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ మాట్లాడుతూ.. వ‌రుస ప‌రాజ‌యాలు తీవ్ర నిరాశ‌కు గురి చేశాయ‌ని చెప్పాడు.

త‌మ జ‌ట్టుకు ఇది క‌ష్ట‌కాల‌మ‌ని అన్నాడు. త‌న‌తో పాటు ఆట‌గాళ్లు అంద‌రూ నిరాశ‌కు లోనైన‌ట్లు చెప్పాడు. మా స్థాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయామ‌నేది వాస్త‌వం. మాకు ఎందుకు ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌నే ప్ర‌శ్న‌కు ప్ర‌స్తుతం త‌న వ‌ద్ద స‌రైన స‌మాధానం లేద‌న్నాడు. జ‌ట్టులో అనుభవజ్ఞులైన ఆట‌గాళ్లు ఉన్నారు. వారి ప్ర‌ద‌ర్శ‌న‌ను నిందిచ‌లేము. స్థాయికి త‌గ్గ‌ట్లుగా ఆడ‌లేదు అన్న‌ది నిజం అని బ‌ట్ల‌ర్ తెలిపాడు.

Greg Chappell : ఆర్థిక ఇబ్బందుల్లో ఆస్ట్రేలియా దిగ్గ‌జం, టీమ్ఇండియా మాజీ కోచ్.. సాయం చేస్తున్న స్నేహితులు

మాది చెత్త టీమ్ కాదు..

‘ప్లేయ‌ర్ల‌ను నిందించాల్సిన ప‌ని లేదు. ఓ ఆట‌గాడు రాత్రికి రాత్రే చెత్త ఆట‌గాడు కాలేడు. అలాగే.. ఒక్క‌రోజులో మాది చెత్త టీమ్‌గా మారిపోదు గ‌దా. మా ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేయ‌డంలో విప‌లం అయ్యాం. ఇదే మా కొంప‌ముంచింది. టీమ్ సెల‌క్ష‌న్‌లో కూడా త‌ప్పిదాలు చేశాము. ప‌దే ప‌దే మార్పులు చేయ‌డం కూడా క‌లిసి రాలేదు. ఏదీ ఎలా జ‌రిగిన‌ప్ప‌టికీ మేము జ‌ట్టుగా ఎదిగిన తీరుకు, నెల‌కొల్పిన ప్ర‌మాణాల ప‌ట్ల గ‌ర్వ‌ప‌డుతున్నాం. మిగిలిన మ్యాచుల్లో మా అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చేందుకు కృషి చేస్తాం.’ అని బ‌ట్ల‌ర్ చెప్పాడు.

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఇంగ్లాండ్ 33.2 ఓవ‌ర్ల‌లో 156 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. బెన్‌స్టోక్స్ (43), బెయిర్ స్టో (30), డేవిడ్ మలాన్ (28)లు ఫ‌ర్వాలేద‌నిపించారు. రూట్ (3), కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ (8), లివింగ్ స్టోన్ (1), క్రిస్ వోక్స్ (0)లు విఫ‌లం కావ‌డంతో ఇంగ్లాండ్ స్వ‌ల్ప స్కోరుకే ప‌రిమిత‌మైంది. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమార మూడు వికెట్లు పడగొట్టాడు. మాథ్యూస్, కసున్ రజిత రెండేసి వికెట్లు తీశారు. మహేశ్ తీక్షణ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

Sachin Tendulkar Statue : భార‌త్‌, శ్రీలంక మ్యాచ్‌కు ముందే స‌చిన్ విగ్ర‌హావిష్క‌ర‌ణ.. ఎందుకో తెలుసా..?

ల‌క్ష్యాన్ని శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి 25.4 ఓవ‌ర్ల‌లో ఛేదించింది. ఓపెన‌ర్ పాతుమ్ నిస్సాంక (77 నాటౌట్‌), సదీర సమరవిక్రమ (65నాటౌట్‌) లు హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో డేవిడ్ విల్లీ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.