Greg Chappell : ఆర్థిక ఇబ్బందుల్లో ఆస్ట్రేలియా దిగ్గ‌జం, టీమ్ఇండియా మాజీ కోచ్.. సాయం చేస్తున్న స్నేహితులు

గ్రెగ్ చాపెల్.. ఈ పేరును భార‌త క్రికెట్ అభిమానులు అంత త్వ‌ర‌గా మ‌రిచిపోరు. టీమ్ఇండియా హెడ్ కోచ్‌లుగా ప‌ని చేసిన వాళ్ల‌లో అత్యంత వివాదాస్ప‌ద‌నమైన వ్య‌క్తిగా పేరు తెచ్చుకున్నాడు.

Greg Chappell : ఆర్థిక ఇబ్బందుల్లో ఆస్ట్రేలియా దిగ్గ‌జం, టీమ్ఇండియా మాజీ కోచ్.. సాయం చేస్తున్న స్నేహితులు

Greg Chappell

Greg Chappell Facing Financial Struggle : గ్రెగ్ చాపెల్.. ఈ పేరును భార‌త క్రికెట్ అభిమానులు అంత త్వ‌ర‌గా మ‌రిచిపోరు. టీమ్ఇండియా హెడ్ కోచ్‌లుగా ప‌ని చేసిన వాళ్ల‌లో అత్యంత వివాదాస్ప‌ద‌నమైన వ్య‌క్తిగా పేరు తెచ్చుకున్నాడు. 2005 నుంచి 2007 మ‌ధ్య కాలంలో టీమ్ఇండియా కోచ్‌గా చాపెల్ ఉన్న స‌మ‌యంలో భార‌త క్రికెట్ అత్యంత గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంది. విభ‌జించు పాలించు అన్నసూత్రాన్ని చాపెల్ గ‌ట్టిగా న‌మ్మేవాడు. ఆ స‌మ‌యంలో సీనియ‌ర్ ఆట‌గాళ్లు అయిన స‌చిన్ టెండూల్క‌ర్‌, సౌర‌వ్ గంగూలీ, రాహుల్ ద్ర‌విడ్ ల మ‌ధ్య విభేదాల‌కు చాపెల్ కార‌ణం అన్న వార్త‌లు వ‌చ్చాయి.

ఏరీ కోరి గ్రెగ్ చాపెల్ ను అప్ప‌టి టీమ్ఇండియా కెప్టెన్ అయిన గంగూలీ కోచ్‌గా తీసుకువ‌చ్చాడు. అయితే.. గంగూలీకే జ‌ట్టులో చోటు లేకుండా చేశాడు. అత‌డి హ‌యాంలో 2007 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా చాలా ఘోరంగా ఓడిపోయింది. దీంతో బీసీసీఐ అత‌డిని కోచ్‌గా త‌ప్పించింది. అయితే.. ప్ర‌స్తుతం ఈ 75 ఏళ్ల ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ ఆర్థిక ఇబ్బందులు ప‌డుతున్నాడు. దీంతో అత‌డి స్నేహితులు ఆన్‌లైన్‌లో విరాళాలు సేక‌రించే ప‌నిలో ఉన్నారు.

IPL 2024 : ఎడారి దేశంలో ఐపీఎల్ వేలం..? ఎప్పుడంటే..?

నా కోస‌మే కాదు.. వారి కోస‌ము ఖ‌ర్చు చేస్తా..

సాధార‌ణంగా క్రికెట‌ర్లు అంతా విలాస‌వంతమైన జీవితాన్ని గ‌డుపుతుంటారు. అయితే.. స్వీయ త‌ప్పిదాల కార‌ణంగా చాపెల్ ఆర్థిక క‌ష్టాల‌ను ఎదుర్కొంటున్నాడు. ఈ అంశంపై చాపెల్ స్పందించాడు. త‌న‌కు మ‌రీ తీర‌ని క‌ష్టాలు ఏమీ లేవ‌న్నాడు. అయితే.. ఈ త‌రం ఆట‌గాళ్లు పొందుతున్న ప్ర‌యోజ‌నాల‌ను మాత్రం ఆనాటి క్రికెట‌ర్లు పొంద‌లేక‌పోతున్నార‌ని చెప్పాడు. ప్ర‌తీ క్రికెట‌ర్ విలాస‌వంత‌మైన జీవితాన్ని గ‌డ‌పాల‌ని భావిస్తాడ‌ని, అయితే.. అంద‌రిలా తాను మాత్రం కాద‌న్నాడు.

ODI World Cup 2023 : లైటింగ్ షో.. అభిమానులకు అనుభూతి.. క్రికెటర్లకు భయానక అనుభవం

నివేదిక ప్రకారం.. గత వారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో జరిగిన సమావేశంలో చాపెల్ స్నేహితులు GoFundMe పేజీని క్రియేట్ చేశారు. ఇందుకు చాపెల్ అయిష్టంగానే అంగీక‌రించాడు. రిటైర్‌మెంట్ త‌రువాత కూడా క్రికెట్‌కు సంబంధించిన కార్య‌క‌లాపాల్లోనే పాల్గొంటున్న‌ప్ప‌టీకీ ఆర్థిక ఇబ్బందులు ప‌డుతున్న ఏకైక ఆట‌గాడిని తానేనంటూ చాపెల్ అన్నాడు. కాగా.. త‌న మిత్రులు సేక‌రిస్తున్న న‌గ‌దును త‌న ఒక్క‌డి కోస‌మే కాకుండా త‌న త‌రంలో క్రికెట్ ఆడి ప్ర‌స్తుతం ఇబ్బందుల్లో ఉన్న క్రికెట‌ర్ల కోసం ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు చెప్పాడు. త‌న సాయంతో ఈ రోజు స్టార్ క్రికెట‌ర్లుగా ఎదిగిన కొంద‌రు.. త‌న పాత్ర‌ను గుర్తిస్తార‌ని తాను న‌మ్ముతున్న‌ట్లు చాపెల్ చెప్పాడు.