MS Dhoni Hairstyle : మిస్టర్ కూల్ న్యూలుక్ అదుర్స్.. ధోనీ కొత్త హెయిర్‌స్టైల్‌‌ చూశారా? ఫొటో వైరల్!

MS Dhoni Hairstyle : మహేంద్ర సింగ్ ధోనీ కొత్త లుక్ ఫొటోలను హెయిర్‌ స్టైలిస్ట్‌ ఆలిమ్‌ హకీం ఇన్‌స్టా వేదికగా షేర్ చేయడంలో వైరల్ అయింది. ఈ ఫొటోకు ‘వన్‌ అండ్‌ ఓన్లీ తలా’.. అంటూ క్యాప్షన్‌ కూడా ఇచ్చాడు.

MS Dhoni Flaunts His New Hairstyle

MS Dhoni Hairstyle : మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ లుక్ అదిరింది.. కొత్త హెయిర్ స్టైల్‌తో ఫుల్ యంగ్ లుక్‌తో మెరిసిపోతున్నాడు. పాతికేళ్ల కుర్రాడిలా మారిపోయాడు. ఇప్పుడు ధోనీ కొత్త హెయిర్ స్టైల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మాహీ.. భవిష్యత్తు గురించి ఊహాగానాలు కొనసాగుతున్న నేపథ్యంలో మిస్టర్ కూల్ విభిన్నమైన రీతిలో కనిపిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఎంఎస్ ధోని తన ఉంగరాల హెయిర్‌స్టైల్‌ మార్చేసి ఎప్పుడూ లేనివిధంగా కొత్త హెయిర్ కట్‌తో కనిపించాడు. వయస్సు 43 ఏళ్లు అయినా కుర్రాడిలా తయారయ్యాడు ధోనీ.

బ్రౌన్ హెయిర్ బేస్‌‌తో కనిపించిన మిస్టర్ కూల్ ట్రెండీ లుక్ చూసి అభిమానులు అదిరిందయ్యా ధోనీ అంటూ పోస్టులు పెడుతున్నారు. ధోనీ కొత్త లుక్ ఫొటోలను హెయిర్‌ స్టైలిస్ట్‌ ఆలిమ్‌ హకీం ఇన్‌స్టా వేదికగా షేర్ చేయడంలో వైరల్ అయింది. ఈ ఫొటోకు ‘వన్‌ అండ్‌ ఓన్లీ తలా’.. అంటూ క్యాప్షన్‌ కూడా ఇచ్చాడు.

మూడు నెలల తర్వాత ధోనీ ఈ కొత్త హెయిర్‌కట్‌తో కనిపించాడు. ఈ ఫొటోను పోస్టు చేసిన మూడు గంటల్లోనే లక్ష 50వేల లైక్‌లు వచ్చాయి. గతేడాది ఐపీఎల్‌లో కూడా లాంగ్‌ హెయిర్‌తో కనిపించి అభిమానులను అలరించాడు. లేటెస్ట్ ధోనీ హెయిర్‌ స్టైల్‌ మాత్రం ట్రెండీగా కనిపిస్తోంది.

ఎంఎస్ ధోని ఐపీఎల్ భవిష్యత్తు? :
ఐదేళ్లకు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడని భారత ఆటగాళ్లను తమ ఫ్రాంచైజీ ‘అన్‌క్యాప్‌డ్’గా రిటైన్ చేసుకునేందుకు వీలు కల్పించే నిబంధనను తిరిగి తీసుకురావాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ధోనీని ‘అన్‌క్యాప్డ్’ ప్లేయర్‌గా కొనసాగించాలని భావిస్తున్నారు. ఈ నియమం ధోని ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) లెజెండరీ కెప్టెన్‌ను నిలుపుకునే అవకాశాన్ని అందిస్తుంది.

ఐపీఎల్, క్రికెట్ నుంచి ధోని రిటైర్మెంట్ ఇప్పుడు కొన్ని సీజన్లలో చర్చనీయాంశంగా మారింది. కానీ, మిస్టర్ కూల్ సీఎస్‌కే ప్లేయింగ్ కీలకమైన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పుడు, ధోనీ కొత్త హెయిర్ స్టైల్ చూస్తుంటే.. రాబోయే ఐపీఎల్ కోసం రెడీ అవుతున్నాడని అనిపిస్తుంది. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌కి ఆడుతాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ వీడ్కోలు పలికి.. ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే.

Read Also : Ajay Jadeja : 15 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన మాజీ క్రికెటర్.. ఈ రాజ సింహాసనానికి వారసుడు.. జామ్ సాహెబ్‌గా ప్రకటన