అరుదైన దృశ్యం: ఒకే వేదికపై ధోనీ, గంభీర్, రోహిత్.. ఎందుకంటే? ఫొటోలు వైరల్

Dhoni-Gambhir Reunited: ధోనీ తన భార్య సాక్షితో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు.

Dhoni-Gambhir Reunited

Dhoni-Gambhir Reunited: భారత క్రికెట్ చరిత్రలో ముగ్గురు దిగ్గజాలుగా పేరుగాంచిన ఎమ్మెస్ ధోనీ, గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ ఒకే వేదికపై కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు.

గుజరాత్ రాష్ట్ర మంత్రి హర్ష్ సంఘ్వీ సోదరుడు ఉత్కర్ష్ సంఘ్వీ వివాహ వేడుకలో ఈ ముగ్గురూ సందడి చేశారు. ముఖ్యంగా, ధోనీ, గంభీర్ కలిసి మాట్లాడుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్ అయిన ఫొటో.. వేడుకలో ప్రత్యేక ఆకర్షణ

గుజరాత్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు అయినా హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్, తిలక్ వర్మ, చాలామంది హాజరయ్యారు.

అయితే, అందరి దృష్టి ధోనీ, గంభీర్‌లపైనే నిలిచింది. వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు (Dhoni-Gambhir Reunited Photos) బయటకు రావడంతో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి.

ధోనీ తన భార్య సాక్షితో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నప్పటికీ, అతను ధోనీ లేదా గంభీర్‌తో కలిసి ఉన్న ఫోటోలు బయటకు రాలేదు.

Also Read: తెలంగాణ కాంగ్రెస్‌లో కమ్యూనికేషన్ గ్యాప్..! ఏం జరుగుతోంది?

ధోనీ భవిష్యత్తుపై ఉత్కంఠ

2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటి నుంచి ధోనీ కార్యక్రమాలలో చాలా అరుదుగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కేవలం ఐపీఎల్‌లో మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఆడుతున్నారు.

అయితే, ఐపీఎల్ 2025 సీజన్ ధోనీకి ఏమాత్రం కలిసిరాలేదు. రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా మధ్యలో మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటికీ, CSK జట్టు చరిత్రలోనే తొలిసారిగా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

44 ఏళ్ల వయసులో ఉన్న ధోనీ ఐపీఎల్ 2026 ఆడతాడా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. తన భవిష్యత్తు నిర్ణయం ఫిట్‌నెస్‌పైనే ఆధారపడి ఉంటుందని ఆయన గతంలో తెలిపారు.

కోచ్‌గా గంభీర్, విశ్రాంతి తీసుకుంటున్న రోహిత్

మరోవైపు, టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి గౌతమ్ గంభీర్ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నాడు.

గంభీర్ మార్గదర్శకత్వంలో భారత్ ఇటీవలే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్‌ను గెలుచుకుంది. ప్రస్తుతం అతని దృష్టంతా ఆసియా కప్ 2025పై ఉంది.

ఇక రోహిత్ శర్మ విషయానికొస్తే, అక్టోబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో జరిగే మూడు వన్డేల సిరీస్‌తో అతను తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు.