MS Dhoni : ధోని న్యూ హెయిర్ స్టైల్ అదుర్స్‌.. 10 ఏళ్లు త‌గ్గిపోయిన‌ట్లు ఉన్నాయ్‌గా..!

టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు ఎంఎస్ ధోనికి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు ఎంఎస్ ధోనికి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికి దాదాపు నాలుగేళ్లు కావొస్తున్న‌ప్ప‌టికి కూడా ధోని ఫ్యాన్ ఫాలోయింగ్ త‌గ్గ‌లేదు స‌రికాదా.. అంత‌కంత‌కూ పెరుగుతూ వ‌స్తోంది. ఇందుకు ఇటీవ‌ల జ‌రిగిన ఐపీఎల్ మ్యాచులే నిద‌ర్శ‌నం. ధోని బ్యాటింగ్‌కు వ‌చ్చిన ప్ర‌తిసారి అత‌డి నామ‌స్మ‌ర‌ణ‌తోనే స్టేడియాలు ద‌ద్ద‌రిల్లిపోయాయి.

ఇక మ‌హి క్రికెట్‌తో పాటు ఫ్యాష‌న్‌ను ఇష్ట‌ప‌డుతుంటాడు. అందుకే అత‌డు త‌ర‌చుగా త‌న హెయిర్ స్టైల్ మారుస్తూ ఉంటాడు. ఇటీవ‌ల ముగిసిన ఐపీఎల్ సీజ‌న్‌లో లాంగ్ హెయిర్‌తో క‌నిపించాడు. కాగా.. తాజాగా మ‌రోసారి ధోని త‌న హెయిర్ స్టైల్ ను మార్చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొత్త హెయిర్ స్టైల్‌లో ధోని వ‌య‌స్సు అమాంతం 10 సంవ‌త్స‌రాలు త‌గ్గిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

IND vs ENG : ఇట్స్ టైమ్ ఫ‌ర్ ల‌గాన్‌.. ఇంగ్లాండ్ పై టీమ్ఇండియా స్వీట్ రివెంజ్‌.. మీమ్స్ వైర‌ల్‌..

ధోని ఫోటోల‌ను ప్ర‌ముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హ‌కీం సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నాడు. మ‌న యంగ్, డైన‌మిక్ అండ్ హ్యాండ్స‌మ్ మ‌హేంద్ర సింగ్ ధోని అంటూ రాసుకొచ్చాడు. ఫోటోలలో ధోని నలుపు రంగు టీ షర్ట్, పొట్టిగా ఉన్న హెయిర్‌కట్‌తో క‌నిపించాడు. మొదటి ఫోటోలో కాస్త సీరియ‌స్‌గా చూస్తుండ‌గా రెండో ఫోటోలో త‌న‌దైన న‌వ్వుతో ధోని ఆక‌ట్టుకుంటున్నాడు.

ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌రుపున ధోని ఆడుతున్నాడు. ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో 220 స్ట్రైక్‌రేటుతో 161 ప‌రుగులు చేశాడు. ఐపీఎల్ 2025 సైతం ఆడాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే.. ఐపీఎల్ 18వ సీజ‌న్‌ను ధోని ఆడ‌తాడా లేదా అన్న విష‌యంపై ప్ర‌స్తుతానికి ఎలాంటి స్ప‌ష్ట‌త లేదు.

Shafali Verma : చ‌రిత్ర సృష్టించిన షెఫాలీ వ‌ర్మ.. టెస్టుల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచ‌రీ.. 22 ఏళ్ల త‌రువాత..

ట్రెండింగ్ వార్తలు