కెప్టెన్ ఆఫ్ వన్డే క్రికెట్ ధోనీ.. టెస్టు కెప్టెన్‌గా కోహ్లీ

వరల్డ్ కప్ విజేత.. భారత సూపర్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ.. కెప్టెన్ ఆఫ్ ద వన్డే టీమ్ ఘనత సాధించాడు. ఈ దశాబ్దంలో అద్భుతంగా రాణించిన క్రికెటర్లతో 11మంది జట్టును ఎంపిక చేయగా అందులో ధోనీ కెప్టెన్ అయ్యాడు. 2011 వరల్డ్ కప్ టీంలో ఆడిన ధోనీ వికెట్ కీపింగ్ బాధ్యతలను చక్కగా నిర్వర్తించి ప్రపంచ కప్ అందించినందుకు ఈ స్థానాన్ని అందుకున్నాడు. తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఈ దశాబ్దంలోని సూపర్ ప్లేయర్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. 

ఆస్ట్రేలియాలోని ఓ ప్రఖ్యాత మీడియాకు రాసిన వ్యాసంలో మార్టిన్ స్మిత్ అనే జర్నలిస్టు ఈ జట్టును తయారుచేశాడు. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీమ్ ఆమ్లాతో కలిపి ఓపెనర్ స్థానం దక్కించుకున్నాడు. ఇక కోహ్లీకి వన్ డౌనే. క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును వన్డే టీమ్ ఆప్ ద డికేడ్ గా ఓ ఇంగ్లీష్ మీడియా చెప్పుకొచ్చింది. అందులోనే స్టీవ్ స్మిత్ ఓ వ్యాసం రాసి ఎంఎస్ ధోనీని ఈ దశాబ్దంలోనే సూపర్ కెప్టెన్ గా అభివర్ణించాడు. విరాట్ కోహ్లీని బెస్ట్ వన్ డే బ్యాట్స్‌మన్ అని పోల్చి చెప్పాడు. 

పూర్తి వన్డే జట్టు ఇదే:
MS Dhoni (c & wk), Rohit Sharma, Hashim Amla, Virat Kohli, AB de Villiers, Shakib Al Hasan, Jos Buttler, Rashid Khan, Mitchell Starc, Trent Boult, Lasith Malinga.

ఇక టెస్టు జట్టుకు వస్తే కోహ్లీ ఒక్కడే అందులో స్థానం దక్కించుకున్నాడు. కెప్టెన్‌గా బెస్ట్ ఆస్ట్రేలియా టెస్టు జట్టులో నిలిచాడు. కానీ, బ్యాటింగ్‌లో 5వ పొజిషన్ ఇచ్చారు. ఆశ్చర్యంగా డివిలియర్స్ ను వికెట్ కీపర్ బాధ్యత వరించింది. ఓపెనర్లుగా అలెస్టర్ కుక్, డేవిడ్ వార్నర్ స్థానం దక్కించుకున్నారు. 

పూర్తి టెస్టు జట్టు ఇదే:
Virat Kohli (c), Alastair Cook, David Warner, Kane Williamson, Steve Smith, Ab de Villiers (wk), Ben Stokes, Dale Steyn, Stuart Broad, Nathan Lyon, James Anderson.