pic credit @ ANI
ఐపీఎల్ 2025 సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ ట్రోఫీని అత్యధికంగా చెరో 5 సార్లు గెలుచుకున్నముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఆదివారం (మార్చి 23) చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనిని ఓ రికార్డు ఊరిస్తోంది.
ఐపీఎల్ మెగా వేలానికి ముందు అన్‌క్యాప్డ్‌గా ప్లేయర్‌గా ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ రూ.4 కోట్లకు రిటైర్ చేసుకున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌కు 2020లో వీడ్కోలు చెప్పిన అతడు కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ 2024లో ఆఖరిలో వచ్చి మెరుపులు మెరిపించాడు.
CSK vs MI : చెన్నైతో మ్యాచ్.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అందుకోనున్న రికార్డు ఇదే..
14 మ్యాచ్‌ల్లో 220.55 స్ట్రైక్‌రేటుతో 161 పరుగులు సాధించాడు. ఇందులో 14 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు ఓ సందర్భంలో ధోని చెప్పాడు.
చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ముంబైతో జరగనున్న మ్యాచ్‌లో ధోని చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటికే ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు ధోని పేరిటే ఉంది. ముంబైతో మ్యాచ్‌లో అతడు 19 పరుగులు చేస్తే.. సీఎస్‌కే తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కనున్నాడు. ఈ క్రమంలో అతడు సురేశ్ రైనాను అధిగమిస్తాడు.
రైనా 176 మ్యాచ్‌ల్లో 4687 పరుగులు చేశాడు. ధోని 234 మ్యాచ్‌ల్లో 4669 పరుగులు సాధించాడు. వీరిద్దరి తరువాత ఈ జాబితాలో డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్‌లు ఉన్నారు.
ఐపీఎల్‌లో సీఎస్‌కే తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..
* సురేశ్ రైనా – 4687 పరుగులు
* ఎంఎస్ ధోని – 4669 పరుగులు
* ఫాఫ్ డుప్లెసిస్ – 2721 పరుగులు
* రుతురాజ్ గైక్వాడ్ -2380 పరుగులు
* అంబటి రాయుడు – 1932 పరుగులు
* రవీంద్ర జడేజా – 1897 పరుగులు
* మైఖేల్ హస్సీ – 1768 పరుగులు
* మురళీ విజయ్ – 1708 పరుగులు
* సుబ్రమణ్యం బద్రీనాథ్ – 1441 పరుగులు
* షేన్ వాట్సన్ -1252 పరుగులు