CSK vs MI : చెన్నైతో మ్యాచ్.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అందుకోనున్న రికార్డు ఇదే..
చెన్నైతో మ్యాచ్ ద్వారా ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను అందుకోనున్నాడు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఆదివారం (మార్చి 23) మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. ఈమ్యాచ్ ద్వారా ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను అందుకోనున్నాడు.
సీఎస్‌కే మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడితే ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు అతడిన రెండో ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డులకు ఎక్కనున్నాడు. ఈ క్రమంలో దినేశ్ కార్తీక్ రికార్డును అధిగమించనున్నాడు. రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 257 మ్యాచ్‌లు ఆడాడు. ఇక కార్తీక్ సైతం ఇన్నే మ్యాచ్‌లు ఆడాడు. కాగా.. దినేశ్ కార్తీక్ ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు ఎంఎస్ ధోని పేరిట ఉంది. ధోని ఇప్పటి వరకు 264 ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడాడు. 39.12 సగటుతో 5243 పరుగులు చేశాడు. ఇక ఈ జాబితాలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 253 మ్యాచ్‌లతో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తరువాత జడేజా,ధావన్, అశ్విన్ లు ఉన్నారు.
ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడింది వీరే..
ఎంఎస్ ధోని – 264 మ్యాచ్‌లు
దినేశ్ కార్తీక్ – 257 మ్యాచ్‌లు
రోహిత్ శర్మ – 257
విరాట్ కోహ్లీ – 253
రవీంద్ర జడేజా – 240
శిఖర్ ధావన్ – 222
రవిచంద్రన్ అశ్విన్ – 212
సురేశ్ రైనా – 205
రాబిన్ ఉతప్ప – 205
అంబటి రాయుడు – 204
రోహిత్ శర్మ 142 పరుగులు చేస్తే..
ఐపీఎల్‌లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు 29.72 సగటుతో 6628 పరుగులు చేశాడు. అతడు మరో 142 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కుతాడు. ఈ క్రమంలో అతడు శిఖర్ ధావన్‌ను అధిగమించనున్నాడు. ధావన్ 222 మ్యాచ్‌ల్లో 35.25 సగటుతో 6769 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్ అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. కోహ్లీ 253 మ్యాచ్‌ల్లో 38.95 సగటుతో 8063 పరుగులు సాధించాడు.