T20 World Cup 2021: ధోనీ చెప్పినట్లుగా ఆడి జట్టును గెలిపించిన మిచెల్

టీ20 వరల్డ్ కప్ న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ తర్వాత డారెల్ మిచెల్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పరుగుల వరద పారించి జట్టును గెలిపించడంతో కీలకంగా వ్యవహరించాడు.

T20 World Cup 2021: ధోనీ చెప్పినట్లుగా ఆడి జట్టును గెలిపించిన మిచెల్

Ms Dhoni

Updated On : November 11, 2021 / 3:14 PM IST

T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ తర్వాత డారెల్ మిచెల్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పరుగుల వరద పారించి జట్టును గెలిపించడంతో కీలకంగా వ్యవహరించాడు. ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ గా క్రీజులోకి వచ్చి మార్టిన్ గఫ్తిల్, కేన్ విలియమ్సన్ దారుణంగా విఫలమై 13/2 స్కోరుకే వెనుదిరిగినా తగ్గలేదు. క్రీజులో పాతుకుపోయి చివరి వరకూ నిలబడటమే కాకుండా 47బంతుల్లో 72పరుగులు సాధించాడు.

మ్యాచ్ ఫినిషింగ్ కు దగ్గరవుతుండగా.. న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ సిమన్ డౌల్ కామెంటరీలో ఉండి ఇలా ఉన్నాడు. మిచెల్ బ్యాటింగ్ చూస్తుంటే ఒకప్పుడు ఎంఎస్ ధోనీ మాటలను గుర్తు చేసుకుని మిచెల్ గేమ్ ఫినిషింగ్ చేస్తున్నట్లు ఉన్నాడంటూ టీమిండియా మాజీ కెప్టెన్ మహీని గుర్తు చేసుకున్నాడు.

‘ద గ్రేట్ ఎంఎస్ ధోనీ, ద గ్రేట్ ఫినిషర్.. ఒకానొక సమయంలో ఇలా అన్నాడు. ఎంతసేపు బ్యాటింగ్ చేస్తే అంత డీప్ గా గేమ్ ను తీసుకున్నట్లు అవుతుంది. అది ప్రత్యర్థి జట్టుకు, బౌలర్ పైనా ఒత్తిడి పెంచుతుంది. అదే డారైల్ మిచెల్ ఇవాళ రాత్రి చేసింది. తొలి 2వికెట్లు దారుణంగా పడిపోవడాన్ని దగ్గర్నుంచి చూశాడు. తానెలా బ్యాటింగ్ చేయాలో ఫిక్స్ అయ్యాడు. అలా జట్టును ఫైనల్ వరకూ తీసుకెళ్లాడు’ అని అన్నాడు డౌల్.

…………………………………………: బీజేపీకి షాక్.. నటి స్రబంతి రాజీనామా!

2ఓవర్లు మిగిలి ఉండగా 20 పరుగులు కావాల్సి ఉంది. అంతే మిచెల్ రెండు పరుగులతో ఓవర్ మొదలుపెట్టి.. క్రిస్ వోక్స్ బౌలింగ్ లో ఒకటి తర్వాత ఒకటి సిక్సులు అలా బాదేశాడు. ఇక ఏ మాత్రం ఆలోచించకుండా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అప్పజెప్పేశారు. న్యూజిలాండ్ తన తర్వాతి మ్యాచ్ అయిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌ను నవంబర్ 14న ఆడనుంది.