Ms Dhoni
MS Dhoni: బిగ్గెస్ట్ స్పోర్టింగ్ స్టార్స్, క్రీడా దిగ్గజాలు 7 అనే నెంబర్ ను బాగా వాడుతుంటారు. ఆ జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీ ఒక్కడే కాదు క్రిస్టియన్ రొనాల్డో కూడా ఉన్నాడు. అయితే చాలా మందిలో మిగిలిపోయిన ప్రశ్న.. ధోనీ జెర్సీ మీద ఏడో నెంబర్ వేసుకోవడానికి కారణం అది తన లక్కీ నెంబర్ అనే అనుమానం ఉంటుంది.
దీనిపై మహేంద్ర సింగ్ ధోనీ క్లారిటీ ఇచ్చాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగ్రేటం చేసిన నాటి నుంచి జెర్సీ నెం.7నే వాడుతున్న ధోనీ.. సంవత్సరాలు మారుతున్నా నెంబర్ మార్చలేదు.
ఇటీవల ఇండియా సిమెంట్స్ వర్చువల్ ఇంటరాక్షన్ నిర్వహించడంతో అభిమానులతో మాట్లాడిన ధోనీ ఏడో నెంబర్ వాడకంపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు. తన లైఫ్ లో ఏడుకు ఉన్న ప్రాముఖ్యతను విడమరిచి చెప్పాడు.
‘చాలా మంది ఏడు నా లక్కీ నెంబర్ అనుకుంటారు. కానీ, ఏడును నేను చాలా సింపుల్ రీజన్ తో ఎంచుకుంటాను. నేను పుట్టింది జులై 7, అది ఏడో నెల ఏడో తేదీ. అందరూ గుడ్ నెంబర్ కావాలని వెదుకుతుంటారు. కానీ, నా పుట్టిన తేదీనే ఎంచుకుంటాను’
Read Also: జీఎస్కేతో కలిసి 6 ఇన్ 1 ప్రచారంలో మహేంద్ర సింగ్ ధోనీ
‘ఎవరైనా అడిగితే నేను పుట్టింది 81వ సంవత్సరం. 8లో నుంచి 1తీసేస్తే ఏడు వస్తుంది. 7చాలా న్యూట్రల్ నెంబర్. చాలా మంది ఇదే అంటుంటారు. కానీ, ఒకవేళ అది న్యూట్రల్ రిజల్ట్స్ ఇవ్వకపోయినా నేను ఏడో నెంబర్ ను మార్చను. దానికి వేరే కారణాలు ఏమీ లేవు. ఇన్ని సంవత్సరాలుగా నాతో పాటే ఉన్న ఏడో నెంబర్ నా మనస్సులో ప్రత్యేక స్థానం దక్కించుకుంది’ అని ధోనీ వివరించారు.
ఐపీఎల్ 2022లో సీఎస్కే కెప్టెన్ గా ఉన్న ధోనీ.. ఏడో నెంబర్ లో బ్యాటింగ్ కు దిగుతాడని సమాచారం. గతేడాది టోర్నీలో రన్నరప్ గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మార్చి 26న తొలి మ్యాచ్ ఆడనుంది చెన్నై సూపర్ కింగ్స్.